Sakshi News home page

భార్యపై కొడవలితో దాడి

Published Mon, Jul 21 2014 4:53 AM

భార్యపై కొడవలితో దాడి - Sakshi

  • అడ్డు వచ్చిన  మామ హతం
  • భర్త ఘాతుకం
  • బెంగళూరు : కుమార్తెపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడగా అడ్డుకునేందుకు వెళ్లిన తండ్రి అల్లుడి చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. వివరాలు..బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటేకు చెందిన కల్పన, నంజనగూడు తాలూకా, చిన్నార గ్రామానికి చెందిన కైలాసమూర్తికు 26 ఏళ్ల క్రితం వివాహమైంది.

    ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. కైలాసామూర్తిది ఉమ్మడి కుటుంబం కాగా వేరు కాపురం పెట్టాలని కల్పన రెండేళ్లనుంచి భర్తపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో కైలాసమూర్తి ఆస్తి విక్రయించి రూ. 40 లక్షలు కల్పనకు ఇచ్చాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. తర్వాత ఆమె ఆ డబ్బును ఓ ప్రైవేటు కంపెనీలో పెట్టుబడి పెట్టింది. ఇదిలా ఉండగా కొంతకాలంగా భార్యతో కలిసి ఉండేందుకు కైలాసమూర్తి ప్రయత్నిస్తున్నా కల్పన  పట్టించుకోలేదు. ఫోన్ చేసినా స్పందిం చేది కాదు.

    మూడు రోజుల క్రితం కల్పన తన తండ్రి మూర్తప్పతో కలిసి బెంగళూరు వచ్చి సుంకదకట్టలోని ఓ లాడ్జీలోలో బస చేశారు. కంపెనీలో పెట్టిన పెట్టుబడికి లాభంగా వచ్చిన రూ. ఆరు లక్షల నగదు తీసుకుని లాడ్జీ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కైలాసమూర్తి శనివారం బెంగ ళూరు చేరుకొని లాడ్జీ వద్ద భార్యతో మాట్లాడటానికి ప్రయత్నించగా ఆమె ఆసక్తి చూపించలేదు. అక్కడే ఉన్న కల్పన తండ్రి కలుగ చేసుకుని హెచ్చరించడంతో కైలాసమూర్తి అక్కడినుంచి వెళ్లిపోయాడు.

    ఆదివారం ఉదయం కల్పన, ఆమె తండ్రి  ఊరికి వెళ్లడానికి సుంకదకట్ట బస్‌స్టాప్ వద్దకు చేరుకోగా అప్పటికే మాటు వేసిన కైలాసమూర్తి కొడవలితో భార్యపై దాడి చేసి గాయపరిచాడు. ముర్తప్ప అడ్డుకునేందుకు వెళ్లగా అతనిపై కూడా కొడవలితో దాడి చేశాడు. స్థానికులు అక్కడకు చేరుకోవడంతో కైలాసమూర్తి ఉడాయించేందుకు యత్నించగా వెంబడిం చి పట్టుకుని దేహశుద్ధి చేశారు.

    దీంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముర్తప్ప మృతి చెందాడు. కల్పన పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement