'ఎంపీ గీతను అనర్హురాలిగా ప్రకటించాలి' | Sakshi
Sakshi News home page

'ఎంపీ గీతను అనర్హురాలిగా ప్రకటించాలి'

Published Fri, Sep 16 2016 7:48 PM

MP Geetha should be disqualified as MP, demands Regu Mahesh

విజయనగరం: ప్రజా ప్రాతినిద్య చట్టం 1951 ప్రకారం అప్పట్లో అఫిడవిట్ దాఖలు చేసినందుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఎంపీగా అనర్హురాలుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఎస్సీ, ఎస్టీ సెల్ న్యాయ సలహాదారు రేగు మహేశ్ చెప్పారు. శుక్రవారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఎలాంటి కేసులు లేవని తన పేరు మీద భూమి లేదని ఎంపీ గీత అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో సర్వే నెంబర్ 83/2 లో 2008 లో గీత పేరు మీద 53 ఎకరాలు కొనగోలు చేశారని ఆయన ఆరోపించారు. సీసీ 881/2013 లో ఆర్థిక నేరాల కేసులో ఎంపీ గీత మూడో ముద్దాయి' అని అన్నారు.

ఈ రెండెంటిని పేర్కొననందుకు గీతను ఎంపీగా అనర్హురాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 2016 మార్చిలో గీత సోదరుడు ఎస్టీ కాదని డిక్లెరేషన్ ఇచ్చిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్.. ఇప్పుడు అదే కలెక్టర్ 2016 లో జులైలో ఎంపీ గీత ఎస్టీ అని ఎలా డిక్లరేషన్ ఇస్తారని? సూటిగా ప్రశ్నించారు. దీనిపై కూడా తాము హైకోర్టుకు వెళ్తున్నామని రేగు మహేశ్ తెలిపారు.

Advertisement
Advertisement