ఫిలింసిటీ ఫైరింగ్: నిందితుల జాడలేదు | Sakshi
Sakshi News home page

ఫిలింసిటీ ఫైరింగ్: నిందితుల జాడలేదు

Published Tue, Jun 2 2015 12:14 AM

ఫిలింసిటీ ఫైరింగ్: నిందితుల జాడలేదు

త్వరలో పట్టుకుంటామన్న ఆరేకాలనీ పోలీసలు
ముంబై: ఫిలింనగర్‌లో కాల్పుల ఘటన జరిగి పదకొండు రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు తంటాలుపడుతున్నారు. షూటర్లను పట్టుకోలేకపోతున్నామని, అయితే తొందరలోనే వారిని పట్టుకుంటామని కేసును దర్యాప్తు చేస్తున్న ఆరే కాలనీ సీనియర్ పోలీసు అధికారి విలాస్ చవాన్ అన్నారు. కాల్పులు జరిపిన వారిని సురేశ్ గైక్వాడ్, సందీప్ ఖైర్నర్, రమేశ్ కాంబ్లేగా పేర్కొంటూ వారి ఫొటోలను పోలీసులకు పంపించామని తెలిపారు.

కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు సుమిత్ టలేకర్ (22), జుగల్ డోడ్రియా (26), యోగేశ్ కోకర్నే (31)లను గతవారమే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. శివసేనకు చెందిన సినిమా వింగ్ ‘చిత్రపత్ సేన’ ఆఫీస్ బేరర్ రాజు షిండేపై ఇటీవల కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం రాజు సబర్బన్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో బాధితుడు రాజు షిండే  చికిత్స పొందుతున్నారు. బాలీవుడ్ నటుడు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే కాల్పుల ఘటన జరిగిని విషయం విదితమే.

Advertisement
Advertisement