ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు | Sakshi
Sakshi News home page

ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు

Published Wed, Apr 6 2016 12:37 PM

ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2002- 2003 మధ్య చోటుచేసుకున్న వరుస పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన 10 మందికి ప్రత్యేక కోర్టు(పోటా కోర్టు) బుధవారం శిక్షలు ఖరారు చేసింది. ప్రధాని నిందితుడు ముజామిల్ అన్సారీ సహా ముగ్గురికి యావజ్జీవ కారగార శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పుచెప్పారు. మిగిలిన ఏడుగురిలో.. నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష, ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష పడింది.

 

2002 డిసెంబర్ 6న ముంబై సెంట్రల్ రైల్వే ష్టేషన లో, 2003 జనవరి 27న ముంగీబాయి మార్కెట్(విల్లే పార్లే)లో, 2003లో ములుంద్ రైల్వేస్టేషన్ లో బాంబులు పేలాయి. మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుల్లో దోషులుగా తేలినవారిలో షకీబ్ నచాన్, ఆతిఫ్ ముల్లా, హసిబ్ ముల్లా, గులామ్ కోటల్, మొహమ్మద్ కామిల్, నూర్ మాలిక్, అన్వర్ అలీ ఖాన్, ఫర్హాన్ కోట్, వాహిద్ అన్సారి, ముజామిల్ అన్సారిలు ఉన్నారు. మొదట ఈ కేసులో పోలీసులు 15 మంది నిందితులను చేర్చారు. వారిలో ఇద్దరు విచారణ సమయంలో మరణించగా, మరో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా విడుదలచేసింది. చివరికి 10 మంది దోషులుగా నిర్ధారించిన కోర్టు బుధవారం ముగ్గురికి శిక్షలు ఖరారుచేసింది. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.

Advertisement
Advertisement