చెత్త వాహనాలతో ధర్నా | Sakshi
Sakshi News home page

చెత్త వాహనాలతో ధర్నా

Published Sat, May 9 2015 6:45 AM

చెత్త వాహనాలతో ధర్నా - Sakshi

చిక్కబళ్లాపురం :  రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో చెత్తను తరలిస్తున్న పౌర కార్మికులు శుక్రవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. చెత్త నింపిన ట్రాక్టర్లను నగరసభ కార్యాలయం ఎదుట ఉంచి జీతాలు ఇచ్చే వరకూ పనిలోకి వెళ్లమంటూ భీష్మించారు.

ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ... ప్రతి నెలా తమకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవసరమైన పనిముట్లను కూడా అధికారులు, కాంట్రాక్టర్లు అందజేయడం లేదని వాపోయారు. పౌర కార్మికులకు, చెత్త వాహనాల డ్రైవర్లకు నెలకు రూ. 4,750 నుంచి రూ. 6వేలు వేతనంగా ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను అధికారులు పాటించడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న నగరసభ కమిషనర్ మునిశామప్ప అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.

Advertisement
Advertisement