నాడా అలర్ట్! | Sakshi
Sakshi News home page

నాడా అలర్ట్!

Published Fri, Dec 2 2016 2:33 AM

Nada alert in tamilnadu

నేడు తీరం దాటనున్న తుపాన్
బలహీనపడినా, గాలితో ముప్పే
కడలూరుపైనే గురి
రంగంలోకి రెస్క్యూ టీం
రాష్ట్రంలో మోస్తరుగా వర్షం!
భారీ గండం తప్పినట్టేనా..?

 
నాడా తుపాన్ శుక్రవారం కడలూరు - వేదారణ్యం మధ్యలో తీరం దాటనుంది. తుపాన్ బలహీన పడ్డా, తీరం దాటేసమయంలో ఈదురు గాలుల రూపంలో భారీ ముప్పు తప్పదన్న సంకేతాలతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. కడలూరు, నాగపట్నంలలో పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీంను రంగంలోకి దించి ఉన్నారు. ఇక, ఈ ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరుగా వర్షం పడింది.

 
సాక్షి, చెన్నై : బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం బలపడి తుపాన్‌గా మారిన విషయం తెలి సిందే. ఈ తుపాన్‌కు నాడా అని నామకరణం చేశా రు. దీని ప్రభావం అత్యధికంగా రాష్ట్రంలోని సము ద్ర తీర జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. రెవెన్యూ మంత్రి ఆర్‌బీ.ఉదయకుమార్, కార్యదర్శి చంద్రమోహన్‌ల నేతృత్వంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి అధికార వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆయా జిల్లాల్లోని పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. సహాయక బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించారు. ఏదేని ప్రళయం చోటు చేసుకున్న పక్షంలో బాధితుల్ని ఆదుకునేందుకు తగ్గట్టుగా సర్వం సిద్ధం చేశారు.

ప్రత్యేకంగా పునరావస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా ఏదేని ముప్పు వాటిల్లినా తక్షణం సమాచారం అందించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు. తుపాన్ తీరం దాటనున్న కడలూరు, నాగపట్నం జిల్లాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు తగ్గట్టు సర్వం సిద్ధం చేశారు. తుపాన్ భయంతో తొమ్మిది జిల్లాల్లో స్కూళ్లకు సైతం శుక్రవారం వరకు సెలవు ప్రకటించేశారు. అరుుతే, తుపాన్ ప్రభావం రాష్ట్రంలో కనిపించలేదని చెప్పవచ్చు. గురువారం భారీ వర్షాలు పడవచ్చని సర్వత్రా ఎదురు చూసినా, అందుకు భిన్నంగా  పరిస్థితి మారింది.

మోస్తరుగా వర్షం: చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు సముద్ర తీరాల్లో జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో జనంలో మరో మారు భయం పుట్టుకుంది. గత ఏడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షం పెను ప్రళయానికి దారి తీయడం ఇందుకు కారణం. అరుుతే, భారీ వర్షం అని చెప్పడం కన్నా, మోస్తరుగా వర్షం తెరపించి తెరపించి పడడంతో సర్వత్రా ఊపిరి పీల్చుకున్నారు. కడలూరు, నాగపట్నం, తంజావూరుల్లో కాసేపు భారీ వర్షం పడ్డా, తదుపరి చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూ వచ్చింది. అత్యధికంగా వేదారణ్యంలో ఐదు సె.మీ వర్షం పడింది.

చెన్నైలో అప్పుడప్పుడు తెరపించి తెరపించి వర్షం పడ్డా, మధ్యాహ్నం కాసేపు భానుడు ప్రత్యక్షం కావడంతో ఇక వర్షం కనుమరుగైనట్టేనా అన్న ప్రశ్న బయలుదేరింది. సాయంత్రానికి మళ్లీ ఆకాశం మేఘావృతంగా మారింది. అర్ధరాత్రి సమయంలో, శుక్రవారం వర్షం పడొచ్చన్న సంకేతాలు ఉండడంతో అధికార వర్గాలు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఇక, సాగరంలో  కెరటాల జడీ మరీ ఎక్కువగా ఉండడంతో సముద్ర తీరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

బలహీన పడ్డా...ముప్పే : బుధవారం తుపాన్‌గా మారిన ద్రోణి గురువారం మధ్యాహ్నం కాస్త బలహీన పడింది. అందువల్లే వర్షం తీవ్రత తగ్గినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. తుపాన్ బలహీన పడ్డా, గాలి తీవ్రత కారణంగా తీరం దాటే సమయంలో ముప్పు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. దీంతో తీరం దాటనున్న కడలూరు నుంచి నాగపట్నం వరకు అప్రమత్తంగా వ్యవహరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సమాచార వ్యవస్థకు ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తల్ని తీసుకున్నారు. అన్ని చోట్ల స్పెషల్ స్క్వాడ్‌‌స ద్వారా  కంట్రోల్ రూంకు ఎప్పటికప్పుడు సమాచారాలు అందే విధంగా పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. శుక్రవారం వేకువ జామున ఈ తుపాన్ తీరం దాటినా, రెండు రోజుల పాటు చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. నాడా తుపాన్ తీరం దాటే క్రమంలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికతో కడలూరు, నాగపట్నం జిల్లాల ప్రజల్లో ఆందోళన బయలు దేరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement