రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవు | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవు

Published Sat, Jun 20 2015 5:13 AM

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవు - Sakshi

జౌళీశాఖ మంత్రి బాబూరావ్ చించనసూర్
దొడ్డబళ్లాపురం :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోలేదని రాష్ట్ర జౌళీ శాఖ మంత్రి బాబూరావ్ చించనసూర్ తెలిపారు. పట్టణంలోని దత్తాత్రేయ క ల్యాణ మండపంలో చేనేతజౌళీ శాఖ మౌలిక స దుపాయాల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో వి ద్యుత్ మగ్గాల కార్మికుల పిల్లలకు విద్యార్థి వే తన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. దొడ్డబ ళ్లాపురం పట్టణంలో మరమగ్గాల కార్మికులు అ త్యధికంగా ఉన్నారని, వీరందరికీ మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో భాగంగా వసతి పథకం కింద మంజూరు చేసిన 100 ఇళ్లతో పా టు అదనంగా మరో 100 ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

గతంలో గృహ నిర్మాణానికి ఇస్తున్న రూ1లక్ష స హాయ ధనం మొత్తాన్ని రూ.2.5లక్షలకు పెం చడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జౌళీ రంగం అభివృద్ధికి ఎక్కువ నిధులు మంజూరు చేస్తున్నారని వివరించారు. జౌళీ రంగంలో హైటెక్ విధానాలను పరిచయం చేసే దిశలో భాగంగా హైటెక్ ట్రైనింగ్ సెంటర్‌లను స్థాపించనున్నట్టు ప్రకటించారు. తాలూకా ఎమ్మెల్యే వెంకటరమణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తాలూకాలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మరమగ్గాల కార్మికుల పిల్లలకు ఇచ్చే విద్యార్థి వేతనాలు రూ.1,200 ఇస్తున్నారని ఈ మొత్తాన్ని పెంచడంతోపాటు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకూ విద్యార్థి వేతనాలు ఇవ్వాలని మనవి చేసుకున్నారు. కార్యక్రమంలో జౌళి శాఖ, స్థానిక ప్రభుత్వ అధికారులు పా ల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement