ప్రజలకు సత్వర సేవలు అందేలా చూస్తాం | Sakshi
Sakshi News home page

ప్రజలకు సత్వర సేవలు అందేలా చూస్తాం

Published Sat, Oct 15 2016 12:38 PM

nunavath panduranga interview with sakshi

బెల్లంపల్లి: బెల్లంపల్లి రెవెన్యూ డివి జనల్ పరిధిలోని ప్రజలకు సాధ్యమైనంత వరకు సత్వర సేవలు అం దిస్తానని  ఆర్డీవో నూనావత్ పాం డురంగ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను క్రమంగా అవగతం చేసుకుంటానని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రం లో పరిపాలన వికేంద్రీకరణ చేసిందని తద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుందని స్పష్టం చేశారు.

పరిపాలన వికేంద్రీకరణ వల్ల 50 కిలోమీటర్ల దూరం వ్యవధిలోనే జిల్లా, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.  ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పరిపాలనలో పారదర్శకత ఉండేలా చూస్తామన్నారు. పేదవారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవినీతి లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement