ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం

Published Thu, Sep 29 2016 4:26 PM

one-maoist-killed-in-chhattisgarh

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాదళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సుక్మా జిల్లా కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నీలమడుగు, వెలిశాల గ్రామాల మధ్య భద్రతా దళాలు కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు. చనిపోయిన నక్సల్‌ను లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్‌కు చెందిన మడకం హంగాగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ ఇందిరా కల్యాణ్ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement