అటవీవాసుల జీవన చిత్రం కాడు | Sakshi
Sakshi News home page

అటవీవాసుల జీవన చిత్రం కాడు

Published Fri, Nov 7 2014 3:02 AM

అటవీవాసుల జీవన చిత్రం కాడు

 అటవీవాసుల జీవన విధానాన్ని మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం కాడు అని ఆ చిత్ర హీరో విదార్థ్ పేర్కొన్నారు. ఈయనకు జంటగా నటి సంస్కృతి నటించిన ఈ చిత్రంలో దర్శకుడు సముద్రకని ముఖ్యభూమికను పోషించారు. చక్రవర్తి ఫిలింస్ ఇంటర్ నేషనల్ పతాకంపై వెరునగర్ నందు, శ్యామ్ కార్తిక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టాలిన్ రామలింగం దర్శకత్వం వహించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర హీరో విదార్థ్   మాట్లాడుతూ అడవులను దోచుకుంటున్న అక్రమార్కుల ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం కాడు అని తెలిపారు.
 
 సామాజిక స్పృహ కల్పించే పలు అంశాలు ఈ చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. దేశం గురించి ఆలోచించే వారు ఈ చిత్రం చూసిన తరువాత అటవీ ప్రాంతాల్లో జీవించే వారి కష్టాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందన్నారు. సాధారణంగా ప్రజలకు ప్రభుత్వంపైన, సమాజంపైన ఒక రకమైన ఆవేశం వ్యక్తం అవుతుంటుందన్నారు. అది ఈ చిత్రంలో సముద్రకని పాత్ర ద్వారా ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య గురించి చర్చించే చిత్రంగా కాడు ఉంటుందని విదార్థ్ తెలిపారు. అడవులనే

Advertisement

తప్పక చదవండి

Advertisement