పోలీస్‌కానిస్టేబుల్‌పై కారంపొడి చల్లి ... | Sakshi
Sakshi News home page

పోలీస్‌కానిస్టేబుల్‌పై కారంపొడి చల్లి ...

Published Wed, Jan 28 2015 2:42 AM

Police Constable on the karampodi flavored

బెంగళూరు(బనశంకరి) :   విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న పోలీస్ కానిస్టేబుల్‌పై కారంపొడి చల్లి దాడి చేసిన సంఘటన బ్యాటరాయణపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... బ్యాటరాయణపుర పోలీస్‌స్టేషన్‌లో నేరవిభాగం పోలీస్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉలాఖాన్ మఫ్టిలో ఉండగడా సోమవారం రాత్రి పది గంటల సమయంలో శామణ్ణగార్డెన్‌లో ఉంటున్న తన నివాసానికి వస్తుండగా ఓ దుండగుడు ఉల్లాఖాన్‌పై కారంపొడి చల్లి దాడి చేసి పారిపోయాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement