చెన్నారావుపేటలో దొంగల హల్‌చల్ | Sakshi
Sakshi News home page

చెన్నారావుపేటలో దొంగల హల్‌చల్

Published Wed, Dec 7 2016 12:30 PM

robbers hulchal in chennarao pet

చెన్నారావుపేట : వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలకేంద్రంలో దొంగలు హల్ చల్ చేశారు. స్థానికంగా ఉన్న పోస్టాఫీసు, పాన్ షాపుల్లో చోరీ చేశారు. ఈ విషయం ఉదయం గమనించిన స్థానికులు పోస్టాఫీసు సిబ్బందికి, పాన్ షాప్ యజమానికి తెలియ జేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మొత్తం చోరీ జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement