ఆ టీచర్ కుటుంబానికి కోటి రూపాయలు | Sakshi
Sakshi News home page

ఆ టీచర్ కుటుంబానికి కోటి రూపాయలు

Published Tue, Sep 27 2016 2:42 PM

ఆ టీచర్ కుటుంబానికి కోటి రూపాయలు

న్యూఢిల్లీ : విద్యార్థుల చేతిలో కత్తిపోట్లకు గురై మృతి చెందిన ఉపాధ్యాయుడు ముఖేశ్ కుమార్ కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే తాము ఆ కుటుంబానికి పరిహారం చెల్లించడం లేదని, కేవలం ఆర్థిక సాయంకోసమే రూ.1కోటి ఇస్తున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్ చేశారు. ‘ఆ కుటుంబం యొక్క వేదనకు ఎటువంటి పరిహారం సరిపోదు... అయితే ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయంగా ఆ కుటుంబానికి రూ .1 కోటి ఇస్తుంది’ అని ట్విట్లో పేర్కొన్నారు. 

సిసోడియా నిన్న రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్ కుమార్ చూసిను సందర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తుందన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎలా పనిచేస్తాడో... అలాగే సమాజానికి గురువు తోడ్పాటు కూడా అంతే ఉంటుందన్నారు.

కాగా పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలోని గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లోముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్ సోమవారం పరీక్ష నిర్వహిస్తుండగా తరగతి గదిలోకి వచ్చిన ఇద్దరు విద్యార్థులు అతడిని  అక్కడే  కత్తితో పొడిచారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తమకు అటెండెన్స్ వేయలేదనే కోపంతో విద్యార్థులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.

Advertisement
Advertisement