రూ.35 లక్షల కొత్త కరెన్సీ దారిమళ్లింపు | Sakshi
Sakshi News home page

రూ. 35 లక్షల కొత్త కరెన్సీ దారిమళ్లింపు

Published Thu, Nov 24 2016 2:01 PM

రూ.35 లక్షల కొత్త కరెన్సీ దారిమళ్లింపు - Sakshi

విశాఖ: నోట్ల రద్దు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్యాంకులు, ఏటీఎం లు ఎక్కడికి వెళ్లినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరెన్సీ సరఫరా లేక దేశమంతా ఓ పక్క ఇక్కట్లు ఎదుర్కొంటుంటే.. మరో వైపు కొత్త కరెన్సీ దారి మళ్లుతోంది. విశాఖ కేంద్రంగా రద్దైన పెద్ద నోట్లను మార్పిడి చేసి కోత్త నోట్లను ఇచ్చే దందా నడుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు 10 మందిని గురువారం అరెస్టు చేశారు. అక్రమంగా కొత్త నోట్లను దారి మళ్లిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
తద్వారా ఆ అంశంపై దృష్టి పెట్టిన పోలీసులు 10 మంది సభ్యుల గల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సిబ్బంది చేతివాటం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలలో నింపాల్సిన కరెన్సీని బహిరంగ మార్కెట్లోకి బ్లాక్ మనీ దందాకు తెరతీశారు. ఇప్పటి వరకూ కోటిన్నర కరెన్సీ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలలో నింపాల్సిన రూ.74 లక్షల కొత్త కరెన్సీని మాయం చేశారు.
 
ఏడాది కాలంగా ఏటీఎంలలో నగదు చోరీ చేస్తున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రధాన నిందితుడు దాసరి శ్రీనివాస్‌తో పాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 35 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సామర్లకోట స్టేషన్‌లలలో సువిధ ట్రైన్‌లో 15 లక్షల కొత్త కరెన్సీతో శ్రీనివాస్ పట్టుబడటంతో ఏటీఎం స్కాం వెలుగులోకి వచ్చింది.
 

 

Advertisement
Advertisement