మహిళల రక్షణ..‘మిథ్య’! | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణ..‘మిథ్య’!

Published Mon, Feb 24 2014 2:33 AM

security to ladies

 సరాసరిన రోజుకో అత్యాచార కేసు నమోదు
 మహిళలపై నానాటికీ పెరుగుతున్న అకృత్యాలు
 భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం
 హెల్ప్‌లైన్ నంబర్ 103 ప్రారంభిస్తామంటున్న పోలీసులు

 
 సాక్షి, ముంబై: నగరంలో మహిళలకు రక్షణ లేకుం డా పోతోంది. ఇక్కడ రోజుకొక అత్యాచార కేసు నమోదవుతోందంటే పరిస్థితి ఎంత విషమంగా ఉం దో అర్ధం చేసుకోవచ్చు. మహిళా రక్షణకు పోలీసు లు తీసుకుంటున్న చర్యలతో ఎటువంటి ఫలితం కనిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2012తో పోల్చితే 2013లో మహిళలపై జరిగిన అత్యాచారాల కేసులు 71 శాతం వరకు పెరిగాయి. ఇటీవల నగర పోలీసులు మహిళలపై నమోదైన అత్యాచార కేసుల వివరాలను వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు మితిమీరిపోతున్నట్లు పోలీసు లు వెల్లడించిన నివేదిక ఆధారంగా స్పష్టం అవుతోంది.
 
  ముంబై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 2013లో నగరంలో దాదాపు 394 అత్యాచార కేసులు నమోదవ్వగా, ఇందులో 241 మంది బాలికలు ఉన్నారు. 2012లో  231 అత్యాచార కేసు లు మాత్రమే నమోదయ్యాయి. ఇదిలా వుండగా 2014లో జనవరి ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వర కు 26 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో రోజుకు ఒక్కటైనా అత్యాచార కేసు నమోదవుతోందని స్పష్టం అవుతోంది. కాగా మహిళలపై వేధింపుల కేసులు 2012తో పోల్చితే 2013లో.. 97 శాతం పెరిగాయి. 2012లో మహిళలపై వేధింపు కేసులు 590 నమోద వ్వగా 2013లో 1,161 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మహిళలపై కిడ్నా ప్ కేసులు కూడా పెరిగాయని చెప్పవచ్చు. 2013లో మహిళల కిడ్నాప్ కేసులు 251 నమోదు కాగా, 2012లో ఆ కేసుల సంఖ్య  141 మాత్రమే. దీంతో మహిళలపై కిడ్నాప్ కేసులు 78 శాతం పెరిగాయని తెలుస్తోంది. ఇదిలా వుండగా చైన్ స్నాచింగ్ విషయానికి వస్తే 2012లో 727 కేసు లు నమోదు కాగా, 2013లో 2,078 నమోదయ్యాయి.
 
 ఈ సందర్భంగా ముంబై కమిషనర్ ఆఫ్ పోలీ స్ రాకేష్ మారియా మాట్లాడుతూ.. మహిళల రక్షణ విషయంలో పోలీస్ శాఖ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం కనిపించడంలేదని చెప్పా రు. ఇక మీదట మహిళల భద్రత విషయమై పకడ్బందీగా వ్యవహరించనున్నామన్నారు. తరచూ కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నామన్నారు. ఇదిలా వుండగా హెల్ప్‌లైన్ నెంబర్ 103ను ఏర్పాటుచేసి హ్యాండిల్ చేసే సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. కాల్ అందుకున్న వెంటనే
 సాధ్యమైనంత త్వరగా మహిళా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయనున్నామని తెలిపారు. అయితే ఒక వేళ ఆ సమయంలో మహిళా సిబ్బంది అందుబాటులో లేకపోతే సమీప ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని పంపించనున్నట్లు తెలి పారు. ఈ ప్రక్రియ వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తుందని మారియా తెలిపారు. అంతేకాకుండా మరో మూడురోజుల్లో రాత్రి వేళ్లలో రోజూ పెట్రోలింగ్‌ను నిర్వహించనున్నట్లు వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement