షారుఖ్‌ఖాన్ ప్రదర్శనతో మైమరిచిన వాషింగ్టన్ | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ఖాన్ ప్రదర్శనతో మైమరిచిన వాషింగ్టన్

Published Mon, Sep 22 2014 11:08 PM

Shah Rukh Khan rocks Washington

వాషింగ్టన్: ‘హ్యేపీ న్యూఇయర్’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ ఆదివారం ఇచ్చిన ప్రదర్శన వాషింగ్టన్‌వాసులతోపాటు దక్షిణాసియావాసులను కట్టిపడేసింది. ఈ ప్రదర్శనలో షారుఖ్‌తోపాటు అభిషేక్‌బచ్చన్, దీపికా పదుకొణే, మలైకా అరోరా ఖాన్, ఫరాఖాన్ తదితరులు పాల్గొన్నారు. నగరశివారు ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో ప్రేక్షకులు తరలిరావడంతో ఆ పరిసరాలన్నీ కిటకిటలాడాయి.
 
 ఈ ప్రదర్శన అనంతరం షారుఖ్ కొంతమందితో సంభాషించాడు. ఆ తర్వాత ఓ జంటకు ఈ సందర్భంగా షారుఖ్... హార్లీడేవిడ్సన్ మోటార్ సైకిల్‌ను కానుకగా ఇచ్చాడు. ఆ కానుకను అందుకున అఫ్ఘాన్ అమెరికన్ నజీరా మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇదే అత్యుత్తమ దినం. షారుఖ్‌ఖాన్‌తో నేరుగా సంభాషించేందుకుగాను ఈ కార్యక్రమానికి రావాలంటూ భర్త జిమ్మీతోపాటు నాకు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. షారుఖ్‌ఖాన్‌ను ఇలా ప్రత్యక్షంగా కలవగలుగుతానని నేనేనాడూ ఊహించలేదు’ అంటూ తన్మయత్వంతో చెప్పింది. పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత షారుఖ్... అమెరికా రాజధాని నగరంలో ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి.
 
 అత్యంత పెద్దదైన జిఫ్ఫీ ల్యూబ్ లైవ్ స్టేజీపై ఖాన్ ప్రదర్శన సాగింది. ఈ హాలులో సీట్ల సామర ్థ్యం 12 వేలు. ‘ పది సంవత్సరాల తర్వాత అమెరికా వచ్చా. ఇక్కడ ఎన్నో మార్పులు కనిపించాయి. అయితే ఒక్కమార్పు మాత్రం కనిపించలేదు. అదేమిటంటే నాపై ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు’ అని అన్నాడు. షారుఖ్ ప్రదర్శనకు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ తదితర దేశాలకు చెందిన ప్రేక్షకులు హాజరయ్యారు.
 

Advertisement
Advertisement