ఆధ్యాత్మిక శోభ | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక శోభ

Published Sat, Apr 1 2017 3:49 PM

ఆధ్యాత్మిక శోభ

► నేడు సిద్ధగంగ మఠంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు
► లక్షకు పైగా హాజరు కానున్న భక్తులు
► 110వ వసంతంలోకి అడుగిడనున్నశివ కుమార స్వామీజీ
► గురువందన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న గవర్నర్‌

శతాధిక స్వామీజీగా పేరు గడించిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శ్రీ శివ కుమార స్వామిజీ శనివారం 110వ వసంతంలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మఠంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం గవర్నర్‌ వజుభాయ్‌ రూడావాలా గురువందనం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

తుమకూరు: శతాధిక స్వామీజీగా పేరు గడించిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శ్రీ శివ కుమార స్వామి శనివారం 110వ వసంతంలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మఠంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తుమకూరు, బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు రానున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు సిద్దగంగ మఠంలో జరుగు గురువందనా కార్యక్రమం మహోత్సవాన్ని గవర్నర్‌ వజుభాయ్‌ రూడావాలా ప్రారంభించనున్నారు.

అదే విధంగా మైసూరు సుత్తూరు మఠానికి చెందిన శ్రీ శివారాత్రి దేశికేంద్ర మహాస్వామి, విజయపుర జ్ఙానయోగానంద సిద్ధేశ్వర స్వామీజీతో పాటు వివిధ మఠాలకు చెందిన స్వామిజీలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.  ఇప్పటికే తుమకూరు నగరంలో ప్రముఖ వ్యక్తులు సంఘ సంస్థలు వివిద రకాల స్వామిజీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడానికి ఆన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. శనివారం లక్ష మంది భక్తులు మఠానికి రానున్నట్లు సమాచారం.  
నేడు స్వామిజీ కార్యక్రమాలు :
శనివారం శివకుమార స్వామిజీ పుట్టినరోజు సందర్భంగా శనివారం తెల్లవారుజామున స్వామిజీ నిద్రలేచి సంద్వవందన కార్యక్రమం,   అనంతరం 5 గంటల సమయంలో హిష్టి లింగపూజ చేస్తారు. అనంతరం ఆరు గంటలకు మఠంలో జరిగే సామూహిక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం స్వామిజీ భక్తులను కలుస్తారు. అనంతరం గురువందనం కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement
Advertisement