నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు | Sakshi
Sakshi News home page

నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు

Published Mon, Aug 22 2016 6:09 PM

నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు - Sakshi

హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నార్సింగి మంచిరేవులలో ఓ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. సిట్ అదుపులో ఉన్న నయీం అనుచరులు ఇచ్చిన సమాచారంతో అస్థిపంజరాన్ని రంగారెడ్డి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అస్థిపంజరం మూడేళ్ల క్రితం నయీం చంపిన 17 ఏళ్ల పని అమ్మాయిదిగా తెలుస్తోంది. ఈ అస్థిపంజరం ఎవరదనేదిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.    
 
మరోవైపు నయీం కేసు ప్రాథమిక దర్యాప్తు మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 33 మంది నయీం అనుచరులను అరెస్ట్ చేయగా, రూ.143 కోట్ల విలువైన నయీం ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement