Sakshi News home page

స్టేట్ బ్యాంకులు బంద్

Published Sat, Jan 9 2016 3:07 AM

స్టేట్ బ్యాంకులు బంద్

ఒక్కరోజు సమ్మెలో ఉద్యోగులు
స్తంభించిన లావాదేవీలు
నేడు, రేపు బ్యాంకులకు సెలవు

వివిధ డిమాండ్ల సాధన కోసం జాతీయ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మెకు పూనుకున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో సేవలు స్తంభించాయి.


 చెన్నై, సాక్షి ప్రతినిధి :  ఉద్యోగుల వేతనాల పెంపు ఇతర డిమాండ్లపై గత ఏడాది మే నెలలో ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో సమ్మెకు పూనుకున్నట్లు యూనియన్ నేతలు చెప్పారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ తిరువాంగూర్, మైసూర్, పాటియాలా, హైదరాబాద్, జైపూర్ తదితర బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించా రు.
 
  గత ఏడాది కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పటివరకూ అమలు చేయకపోవడం శోచనీయమని నిరసించారు. పనిభారం పెరిగిపోయిందని, అదనపు వేళలు పని చేయిస్తున్నార ని, బలవంతపు బదిలీలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెన్నై ప్యారీస్‌లో ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం విధులకు హాజరయ్యారు. కింది స్థాయి సిబ్బంది లేని కారణంగా లావాదేవీలు యథావిధిగా సాగలేదు.
 
  అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచలం మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తం మీద 6 వేల బ్యాంకు శాఖలు ఉండగా 30 వేల మంది ఉద్యోగులు శుక్రవారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. చెన్నైలోని 1100 శాఖలకు చెందిన 8 వేలమంది సమ్మె చేశారని చెప్పారు. సమ్మె కారణంగా రాష్ట్రం మొత్తం మీద సుమారు రూ.5.6 కోట్ల చెక్కుల లావాదేవీలు ఆగిపోయాయి.
 
 వరుసగా సెలవులు   :ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడినట్లయింది. శుక్రవారం సమ్మె, 9వ తేదీ రెండవ శనివారం, 10న ఆదివారం కారణంగా సెలవు. వరద సహాయక చర్యల కింద ప్రభుత్వం అందజేసిన రూ.5వేలు నగదు బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసుకునేందుకు బాధితులు ప్రతిరోజూ బారులుతీరుతున్నారు. ఇక, 11వ తేదీ సోమవారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ తరువాత పొంగల్ పండుగ సెలవులతో మరోసారి బ్యాంకులకు తాళాలు పడనున్నాయి.
 

Advertisement

What’s your opinion

Advertisement