పెళ్లి రోజున అన్నదానం!

26 Feb, 2015 02:28 IST|Sakshi
పెళ్లి రోజున అన్నదానం!

పెళ్లి రోజున సూపర్‌స్టార్ రజనీకాంత్, లతా దంపతులు అనాథల సేవలో గడపనున్నారు. సూపర్‌స్టార్ వివాహం 1981 ఫిబ్రవరి 26న జరిగింది. వీరి దాంపత్య జీవితం గురువారానికి 34 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ పెళ్లి రోజును రజనీకాంత్ , లతా దంపతులు అనాథల సేవలో గడపడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తలైవర్ ఫౌండేషన్ తరపున కాట్టాన్ కొళత్తూరులోని శివానంద గురుకుల ఆశ్రమంలో 320 మంది అనాథ బాలలకు 60 మంది వయసు మళ్లిన వారికి అన్నదానం చేయనున్నారు. కార్యక్రమంలో రజనీకాంత్ అభిమాన సంఘం నిర్వాహకులు సైదైరవి, వాలాజా కలిప్ పాల్గొననున్నారు. అదే విధంగా రజనీ అభిమానులు నృత్య దర్శకుడు లారెన్స్ నిర్మించిన అంబత్తూరులోని శ్రీ రాఘవేంద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇంకా నగరంలోని పలు దేవాలయాల్లో రజనీకాంత్, లత దంపతుల పేర్లతో అర్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు