స్వచ్ఛ భారత్‌కు కలిసి కృషి చేద్దాం | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్‌కు కలిసి కృషి చేద్దాం

Published Mon, Oct 6 2014 12:52 AM

స్వచ్ఛ భారత్‌కు కలిసి కృషి చేద్దాం - Sakshi

 స్వచ్ఛ భారత దేశం కోసం అందరం కలిసి కృషి చేద్దాం అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నటుడు సూర్య మద్దతు పలికారు. భారత దేశాన్ని స్వచ్ఛమైన భారత దేశం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ క్లీన్ ఇండియా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకు గాంధీ జయంతి రోజున ఆయన ఢిల్లీలో చీపురు చేత బట్టి రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చట్టారు. ఈ సందర్భంగా ప్రధాని కళా, క్రీడా రంగాలకు చెందిన కమల్ హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంక చోప్రా, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులను క్లీన్ ఇండియా పథకానికి ఆహ్వానించగా, వారు అంగీకరించారు.
 
 ప్రధాని ఆహ్వానానికి స్పందించిన కమల్ 90 లక్షల మంది అభిమానుల్ని ఈ పథకంలో చేర్చుతానని ప్రకటించారు కూడా. తాజాగా నటుడు సూర్య స్వచ్ఛ భారత్ కోసం తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే పలువురికి విద్యా దానం చేస్తున్న సూర్య  క్లీన్‌ఇండియా పథకానికి మద్దతు పలికారు. సూర్య పేర్కొం టూ మనల్ని మన ఇంటిని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అన్నారు. ఇది ప్రతి మనిషి ఆరోగ్యానికి దోహదం చేస్తుందన్నారు. మన పిల్లలకు విద్యా బుద్ధ్దులు నేర్పించడం ఎంత ముఖ్యమో పరిశుభ్రత కల్పించడం అంతే ముఖ్యమన్నారు. ఆరోగ్యకరమైన భారత దేశాన్ని పరిశుభ్ర మైన భారత దేశంగా మార్చుదాం. ప్రధాని నరేంద్ర మోదీ క్లీన్ ఇండియా పథకాన్ని సంపూర్ణ మద్దతు పలుకుదాం అంటూ పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement