ఈ తెలుగు తమ్ముళ్ల డ్యాన్స్‌ చూస్తే అవాక్కే! | Sakshi
Sakshi News home page

ఈ తెలుగు తమ్ముళ్ల డ్యాన్స్‌ చూస్తే అవాక్కే!

Published Mon, Jan 2 2017 2:38 PM

ఈ తెలుగు తమ్ముళ్ల డ్యాన్స్‌ చూస్తే అవాక్కే! - Sakshi

కనిగిరి: తెలుగు తమ్ముళ్లు లుంగీ డ్యాన్స్‌, గాంగ్‌నమ్‌ చిందులతో రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో దిమ్మతిరిగే స్టెప్పులతో, అవాక్కయ్యే హావభావాలతో చూసిన వారంతా నోరెళ్లబెట్టే పని చేశారు. రికార్డింగ్ డ్యాన్సులను తలపించేలా చిందులు వేశారు. టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రికార్డింగ్‌ డ్యాన్స్‌లను తలపించే పాట కచేరీ ఏర్పాటు చేశారు. ఈ వేదికపై టీడీపీ మండల అధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి, కనిగిరి మున్సిపల్‌ ఛైర్మన్‌ చినమస్తాన్‌ ఉండి హుషారెత్తే చిందులతో హోరెత్తించారు. మహిళా డ్యాన్సర్లతో చిందులు వేస్తూ కాస్తంత అభ్యంతరకరంగా కనిపించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా స్టేజీ వద్దే కూర్చోవడం గమనార్హం. అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఈ పాట కచేరికి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం మరో విశేషం. కనీసం స్టేజీ వద్దకు కూడా వారు రాలేదు. ఇది అధికార పార్టీ రాజకీయ అహంకారానికి నిదర్శనమని స్థానికులు గుసగుసలాడుకున్నారు.

Advertisement
Advertisement