సీఎం కాన్వాయ్‌ ఆకస్మిక చక్కర్లు | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్‌ ఆకస్మిక చక్కర్లు

Published Sat, Oct 15 2016 4:51 PM

సీఎం కాన్వాయ్‌ ఆకస్మిక చక్కర్లు - Sakshi

దుద్దెడ శివారులో పరుగులు తీసిన కాన్వాయ్‌
స్థానికంగా చర్చనీయాంశం
 
కొండపాక: మండలంలోని దుద్దెడ శివారులో సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా చక్కర్లు కొట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దుద్దెడ–మర్పడ్గ శివారులో రాజీవ్‌ రహదారిని ఆనుకొని విలువైన ప్రభుత్వ భూములున్నాయి. ఈ క్రమంలో నూతనంగా సిద్దిపేట జిల్లా ఏర్పడటంతో ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలకు ఈ స్థలాల  పరిశీలనకే సీఎం వచ్చి ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా దుద్దెడ శివారులో గత టీడీపీ హయాంలో నిర్మించి వృథాగా ఉన్న మలుపు ప్రాంగణం (లెదర్‌ ఫ్యాక్టరీ) రాజీవ్‌ రహదారికి ఆనుకొని ఉంది.
 
ఈ స్థలంలో ఏదైనా ప్రభుత్వ ముఖ్య కార్యాలయ భవన నిర్మాణం కోసం ఉపయోగించుకునేందుకు అవసరపడుతుందని వాహనంలో నుంచే పరిశీలించి వెళ్లారని స్థానికులు భావిస్తున్నారు. దుద్దెడ– మర్పడ్గ సరిహద్దు శివారులో గల నాగులబండ వద్ద సీఎం కాన్వాయ్‌ యూటర్న్‌ తీసుకుని వెళ్లింది. ఏదిఏమైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియకుండా సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ వచ్చి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
 
 

Advertisement
Advertisement