హత్యాయత్నం కేసులో ప్రియుడు అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో ప్రియుడు అరెస్ట్‌

Published Thu, Jul 6 2017 4:32 AM

హత్యాయత్నం కేసులో ప్రియుడు అరెస్ట్‌ - Sakshi

టీనగర్‌: కళాశాల విద్యార్థినిని హతమార్చేందుకు ప్రయత్నించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, కొళత్తూరుకు చెందిన శక్తి ప్రైవేటు కళాశాలలో చదువుతుండగా కృష్ణగిరికి చెందిన మురళితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇరువురూ ప్రేమించుకోసాగారు. వీరిద్దరు కొన్ని రోజుల క్రితం కారులో మదురై, తంజావూరు సహా పలు ప్రాంతాలకు విహారయాత్రగా వెళ్లారు. అదేసమయంలో కడలూరు జిల్లా, పన్రూట్టి సమీపంలోగల ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.

మురళి, శక్తితో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని, అందువల్ల ఆత్మహత్య చేసుకుందామని తెలిపాడు. ఈ మాటలను శక్తి నమ్మింది. అయితే శక్తిని మోసగించి ఆమెను హత్య చేసేందుకు మురళి కుట్ర పన్నిన విషయం ఆమెకు తెలియలేదు. ఆమెను మురళి మాటలతో మభ్యపెట్టి అక్కడున్న జీడిమామిడి తోటకు తీసుకెళ్లాడు. వెంటనే, ఆమె ఒంటిపై డీజిల్‌ పోసి నిప్పంటించాడు. తర్వాత కారులో తప్పించుకుని పరారయ్యాడు. శక్తిని గ్రామస్తులు రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. ఇలావుండగా మురళి కృష్ణగిరిలో ఉన్న సెల్‌ఫోన్‌ దుకాణంలో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి బుధవారం ఉదయం మురళిని అరెస్టు చేశారు. అతని వద్ద విచారణ జరపగా అతనికి వివాహమై భార్య, ఒక బిడ్డ ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement