♦ జైలు జీవితం నాటకం
♦ ఖరీదైన ఫ్లాట్‌లోనే కాపురం
♦ శిక్ష పెరిగే అవకాశం ఉందన్న డీఐజీ రూప
♦ రూ.2 కోట్ల హవాలా సొమ్ముపై ఆధారాలు
‘పేరుకే జైలు జీవితం.. ఖరీదైన అపార్టుమెంటులోనే కాపురం.. ఐదు గదుల్లో సకల సౌకర్యాలు.. లెక్కకు మించిన అందమైన చుడీదార్లు.. రంగు రంగుల చీరలు.. వామ్మో చిన్నమ్మ..’ అనిపిస్తోందని బెంగళూరు జైల్లో చిన్నమ్మ జీవితంపై డీఐజీ రూప చెప్పిన మాటలు.
సాక్షి ప్రతినిధి, చెన్నై:
ముప్పై రెండేళ్లపాటూ జయలలితతో ఖరీదైన జీవితాన్ని అనుభవించిన శశికళ జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయారు. జైలు నిబంధనలను తుంగలో తొక్కి లగ్జరీగా బతికేందుకు రూ.2 కోట్ల ముడుపులు ఇచ్చినట్లుగా డీఐజీ రూప శశికళ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. కర్ణాటక ప్రభుత్వాన్ని గడగడలాడించే ఆరోపణలు చేసిన ఫలితంగా జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్ విభాగ డీఐజీగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఒక సాయంకాల తమిళ పత్రిక (తమిళ్ మురసు సాయంకాల దినపత్రిక)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం ప్రచురితమైంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.
జైలులో చోటుచేసుకున్న అవకతవకలపై ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించాను. ఆ నివేదికలో పేర్కొన్నవన్నీ నూరుశాతం నిజాలే. జైల్లోని పరిస్థితులపై నాకు ఫిర్యాదు రాగానే నాలుగుసార్లు తనిఖీలు నిర్వహించాను. తనిఖీలకు వెళ్లినపుడల్లా ఖైదీలను కొందరు అధికారులు బెదిరింపులకు గురిచేసేవారు. దీంతో కొన్ని విషయాలు నా దృష్టికి రాకుండా పోయాయి. శశికళకు ఐదు గదులు కేటాయించింది నిజం. ఆ గదుల్లో ఎల్ఈడీ టీవీ, మంచం, కుక్కర్, కాఫీ మేకర్, సూప్ తయారీ సామన్లు ఇలా గృహోపకరణ వస్తువులన్నీ ఉన్నాయి. రెండో రూములో లెక్కలేనన్ని చుడీదార్లు, చీరలు, నైటీలు ఉన్నాయి.
ఖైదీలు ధరించాల్సిన యూనిఫాంను ఆమె ఒక్కరోజు కూడా వేసుకోలేదని ఆమె గదిలో ఉన్న యూనిఫాం దుస్తుల మడతలే చెబుతున్నాయి. శశికళకు అవసరమైన మందులు బయట నుంచే వస్తున్నాయి. శశికళకు జైల్లో ఆపిల్ ఐ ఫోన్, రెండు సిమ్కార్డులున్నట్లు సమాచారం అందింది. అయితే ఆమెను తనిఖీ చేసినపుడు అవి దొరకలేదు. సెల్ఫోన్లు పనిచేయకుండా జైలులో అమర్చిన జామర్లు గురించి సిబ్బందిని ప్రశ్నించగా మరమ్మతులకు గురైనట్లు బదులిచ్చారు. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు ఏదో ఒక పనిచేయాలి. అయితే శశికళ తదితరులు ఇంతవరకు ఏ పనీ చేయడం లేదు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చే ప్రయత్నంలో దినకరన్‌తోపాటూ పట్టుబడిన బెంగళూరు ప్రకాష్ జైల్లో అనేకసార్లు శశికళను కలుసుకున్న వైనాన్ని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
అపార్టుమెంటులోనే చిన్నమ్మ
మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శశికళ అసలు జైల్లోనే ఉండరు. జైలుకు సమీపంలోని ఒక అపార్టుమెంటులో నివసిస్తున్నట్లు నాకు సమాచారం అందింది. స్వయంగా పట్టుకోవాలని అనేకసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జైలు నుంచి బయటకు వెళుతూ నాకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఉంటే తీసుకునే చర్యలు చాలా భయంకరంగా ఉండేవి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. నేను చేసిన ఆరోపణలు రుజువైన పక్షంలో ఆమెకు మరికొన్ని ఏళ్లు శిక్షపడే అవకాశం ఉంది. అని రూప చెప్పారు.
మరలా ఖైదీ జీవితం
శశికళకు రహస్యంగా సాగుతున్న లగ్జరీ సౌకర్యాల గుట్టు రట్టు కావడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలును కట్టుదిట్టం చేశారు. శశికళ తనకు కేటాయించిన సెల్లోనే కాలం గడుపుతున్నారు. ఆమె సెల్ చుట్టూ అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం ప్రారంభించాయి. జైలులో ఏం జరుగుతోంది అనే వివరాలు సీసీ కెమరాల ద్వారా బెంగళూరు శేషాద్రి రోడ్డులోని జైళ్లశాఖ అదనపు డీజీపీ, డీఐజీ గదుల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. దీంతో గత సోమవారం నుంచి జైలులో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోలేదు. బయటనుంచి వచ్చే భోజనం బంద్ కావడంతో ఇతర ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే శశికళ ఆరగిస్తున్నారు.
రేపే తొలి విచారణ పత్రం సమర్పణ
డీఐజీ రూప ఏకంగా తనపై అధికారి డీజీపీపైనే ఆరోపణలు చేయడంతో కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. చెన్నైకి చెందిన ఒక ప్రముఖుడు శశికళకు ఏసీ, స్టవ్, ఫ్రిడ్జ్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. రూ.2 కోట్ల హవాలా సొమ్ము అధికారులకు ముట్టినట్లుగా విచారణాధికారులకు ఆధారాలు దొరికినట్లు సమాచారం. దీంతో తమ తొలిదశ విచారణ నివేదికను ఈనెల 24వ తేదీన కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయితే బెంగళూరు జైలు అధికారులు పలువురు సస్పెండ్ అవుతారని అంచనా.
వామ్మో.. చిన్నమ్మ
Published Sun, Jul 23 2017 3:49 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement