కొనసాగుతున్న ‘రెస్క్యూ’ | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ‘రెస్క్యూ’

Published Tue, Aug 5 2014 2:04 AM

The ongoing 'Rescue'

  •  
  •   రంగంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిపుణులు
  •   ఫలించని ‘జీవరక్షక’  ప్రయత్నాలు
  •   కొనసాగుతున్న సమాంతర సొరంగం తవ్వకాలు
  •   ప్రాణాలతోనే ఉన్నట్లు  సీఎం ప్రకటన
  •   ముగ్గురు అధికారులపై వేటు
  • సాక్షి, బెంగళూరు : బోరుబావిలో పడిన తిమ్మణ్ణను రక్షించే చర్యలు సోమవారం కూడా కొనసాగాయి.  జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన ఆరుగురు నిపుణులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు 24 గంటలుగా ప్రయత్నిస్తున్నారు. బెల్గాం జిల్లా బాదామి తాలూకా సూళికెరె గ్రామంలో సొంత పొలంలో ఆడుకుంటూ తిమ్మణ్ణ ఆదివారం మధ్యాహ్నం బోరుబావిలో  పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రక్షణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.  

    మండ్యా జిల్లా కొమ్మన హళ్లికి చెందిన మంజేగౌడ తాను తయారు చేసిన ‘జీవరక్షక’ అనే యంత్రం ద్వారా పిల్లవాడిని బోరు బావి నుంచి బయటకు తీసుకురావడానికి రెండు సార్లు విఫలయత్నం చేశారు. మొదట దాదాపు 120 అడుగుల వరకూ వెళ్లిన యంత్రం సాంకేతిక లోపం వల్ల మరింత లోతుకు వెళ్లలేక పోయింది. దీంతో యంత్రాన్ని బయటకు తీసి లోపాన్ని సరిచేసి మరోసారి బోరుబావిలోకి వదిలారు.

    ఈ సారి దాదాపు 140 అడుగుల వరకూ వెళ్లిన యంత్రం పిల్లాడిని గుర్తించి (తనకున్న చేతుల వంటి పరికరాల ద్వారా) పట్టుకోవడంలో విఫలమైంది. మరో రెండు సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో అధికారుల సూచన మేరకు మంజేగౌడ తన ప్రయత్నాన్ని మానుకున్నారు. ఇదిలా ఉండగా ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులు జేసీబీల సహయంతో బోరుబావికి సమాంతరంగా సొరంగమార్గాన్ని తవ్వే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. అయితే పెద్ద బండరాయి అడ్డు రావడంతో పనులు నిదానంగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా హుబ్లీలో సిద్ధరామయ్య సోమవారం మాట్లాడుతూ... తిమ్మణ్ణ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని వెల్లడించారు.
     
    ప్రత్యేక పూజలు.. : తిమ్మణ్ణ క్షేమంగా తిరిగిరావాలని అతను చదువుతున్న ఫినిక్స్ పాఠశాలోని విద్యార్థులు, యాజమన్యం ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక ప్రార్థనాలయాల్లో వివిధ వర్గాల వారు తిమ్మణ్ణ ప్రాణాలతో బయటపడాలని కోరుతూ ప్రార్థనలు చేశారు.
     
    ముగ్గురు అధికారులపై వేటు
     
    ‘తిమ్మణ్ణ’ ఘటనకు సంబంధిత విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కురుబగట్టి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శెట్టితోపాటు పంచాయతీ డెవెలప్‌మెంట్ అధికారి షౌకత్ ఆలీని బాధ్యులను చేస్తూ వారిని విధుల నుంచి తప్పించారు. ఈ మేరకు గ్రామీణాృవద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ నూతన ఆదేశాలు జారీ చేశారు. వాటిని ఉల్లంఘిస్తే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement