పూలేకు ఘన నివాళి | Sakshi
Sakshi News home page

పూలేకు ఘన నివాళి

Published Fri, Apr 11 2014 10:41 PM

to Mahatma phule grandly tributes

 సాక్షి, ముంబై: పుణేలోని గంజ్‌పేట్‌లో మహాత్మా ఫులే నివాసంలో పూలే దంపతుల విగ్రహాలకు ‘తెలంగాణ విద్యావంతుల వేదిక-మహారాష్ట్ర’ బృందం నివాళులర్పించింది. పూలే మనవరాలు నీతాతాయి ఓలే-పులే ఆహ్వానం మేరకు శుక్రవారం ముంబై నుంచి వేదిక బృందం పుణేకి వెళ్లింది. ఈ సందర్భంగా ఈ బృందంలో సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 11 ను జాతీయ పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పుణే యూనివర్సిటికీ సావిత్రీమాయి పేరు పెట్టాలన్నారు.

 ఈ కార్యక్రమంలో వేదిక కన్వీనర్ జి.గంగాధర్ గంగపుత్ర, సిరిమల్లే శ్రీనివాస్, చిలుక వినాయక్, మూల్‌నివాస్‌మాల, ఆనందా ఓవాల్, జి.రాందాస్ పద్మశాలి, హరీష్ ఉచ్చిల్, శంకరయ్య ముత్తెంవార్ తదితరులు పాల్గొన్నారు.

 ములుండ్‌లో....
 ముంబై తె లంగాణ బహుజన ఫోరం (ఎంటీబీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం పశ్చిమ ములుండ్‌లోని తెలుగునాకా వద్ద జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంటీబీఎఫ్ కన్వీనర్ బి.ద్రవిడ్ మాదిగ, శనిగారం రవి, జుట్టు లక్ష్మణ్,  కామ శేఖర్, తిరుపతి, దుర్గ రమేశ్, ఎస్.టైటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాదిగ మాట్లాడుతూ  పూలే ఆశించిన సమాజం కోసం మనమంతా ఏకమై ఉద్యమించాలన్నారు. ఆయన కృషివల్లనే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారు విద్యావంతులయ్యారంటూ కొనియాడారు. జై భీం, జై జ్యోతిబా అంటూ పెద్దఎత్తున నినదించారు.

Advertisement
Advertisement