'అనాలోచిత నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం' | Sakshi
Sakshi News home page

'అనాలోచిత నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం'

Published Sat, Dec 31 2016 1:32 PM

'అనాలోచిత నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం'

హైదరాబాద్‌: నోట్ల రద్దు చర్య మోదీ అనాలోచిత నిర్ణయమని, దీని వలన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీసీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో.. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. జనవరి రెండో తేదీన జిల్లా కేంద్రాల్లో ప్రెస్‌మీట్లు, 5,6,7వ తేదీల్లో కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే జనవరి 9న మహిళలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 11వ తేదీన ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement