కేంద్ర మంత్రి గెహ్లాట్ తో బీసీ నేతల భేటీ | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి గెహ్లాట్ తో బీసీ నేతల భేటీ

Published Fri, May 13 2016 2:36 AM

Union Minister Gehlo held a meeting with the leaders of BC

బీసీల సమస్యలు పరిష్కరించాలని వినతి

 సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం గురువారం ఇక్కడ కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌తో భేటీ అయింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్.కృష్ణయ్య, బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి 15 డిమాండ్లను ఆయన మంత్రి ముందుంచారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్‌ను తొలగించాలని కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 

 కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాయని, కర్ణాటకలో కూడా ఇదే విధంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈమేరకు గురువారం ఒక వినతి పత్రాన్ని సిద్దరామయ్యకు అందజేసింది. ప్రతినిధి బృందంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర నేతలు గుజ్జ కృష్ణ, రుషి అరుణ్, పి.శ్రీనివాసరావు, పి.హనుమంతరావు, పి.వి.మహేశ్, దుర్గయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement