విశాఖ బీచ్‌ కోతపై నిపుణుల ఆందోళన | Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్‌ కోతపై నిపుణుల ఆందోళన

Published Fri, Feb 10 2017 4:31 PM

Visakhapatnam beach erosion

విశాఖపట్టణం: విశాఖ సముద్ర తీరం తీవ్రంగా కోతకు గురికావటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బీచ్‌ కోతకు గురవుతున్న తీరు, ఈ అంశంపై జరుగుతున్న పరిశోధనలను చర్చించారు. విశాఖ రామకృష్ణ బీచ్‌ వద్ద ప్రమాదకర రీతిలో ఇసుక కోతకు గురికావటాన్ని ప్రస్తావించారు. నగరంలో పారిశ్రామికీకరణ కారణంగా వాతావరణంలో పెరుగుతున్న కలుషితాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని భావిస్తున్నారు.
 
వాతావరణ కాలుష్యం ఫలితంగా సముద్ర జలాల్లో లవణీయత పెరుగుతోందని, దానిద్వారా సముద్ర జీవావరణం ప్రమాదంలో పడుతోందని తేల్చారు. గోవాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా వివిధ పరిశోధన సంస్థలు, యూనివర్శిటీల నిపుణులు హాజరయ్యారు.

Advertisement
Advertisement