అక్షర ఆరంభం | Sakshi
Sakshi News home page

అక్షర ఆరంభం

Published Sun, Jan 18 2015 2:20 AM

అక్షర   ఆరంభం

అక్షర... ఈ మూడు అక్షరాల వెనుక పెద్ద నటనాధ్యాయమే ఉంది. నటననే శ్వాసి స్తూ దాన్ని శాసించే స్థాయికి ఎదిగిన కమలహాసన్, సారికల ముద్దు బిడ్డ అక్షరహాసన్. నటనలో ఎదుగుతున్న శ్రుతి హాసన్ చెల్లెలు. మొత్తం మీద నటనే నమ్ముకున్న కుటుంబం నుంచి నటనలో నడకలు నేర్చుకోవడానికి శ్రీకా రం చుట్టిన అక్షర తొలి అడుగు ఫలితం కోసం చెప్పలేనంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్షరహాసన్ నటించిన తొలి చిత్రం షమితాబ్ (హిందీ) చిత్రం త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా నటన లో ఓనమాలు దిద్దుకున్న ఈ బ్యూటీ పలుకులు ఏంటో చూద్దాం.
 
 తొలి చిత్ర అనుభవం
 షమితాబ్ చిత్రంలో నటించడం చాలా తీయని అనుభవం. అమితాబ్‌బచ్చన్ లాంటి గొప్ప నటులతో పని చేసిన బాల్కి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తో ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యాను. అంతేకాదు నా తొలి చిత్రంలోనే అమితాబ్ తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే ధనుష్ నుంచి కూడా. ఈ చిత్ర యూ నిట్ లో అందరికన్నా అన్ని విషయాల్లోనూ చిన్నదాన్ని నేనే.
 
 నాన్న నుంచి చాలా నేర్చుకున్నా
 అయితే నటన విషయంలో అమ్మానాన్నల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక నేను వాళ్ల జీన్స్‌ను కాబట్టి వారి క్వాలిటీస్ నాలో సహజంగానే ఉంటాయి. అయితే అమ్మానాన్నలు లోతైన ఆలోచనలు నన్నిప్పటికీ విస్మయపరుస్తుంటాయి. నటన లో నాన్న నుంచి చాలా టిప్స్ పొందాను. సమాజాన్ని కూడా సున్నితంగా గమని స్తుంటాను. సగటు మనిషి ప్రవర్తన ఎలాంటిదని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.
 
 కారణం అదే
 షమితాబ్ చిత్రానికి ముందు తమిళం లో మణిరత్నం దర్శకత్వంలో కడల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిం ది. అయితే ఆ సమయంలో నేను నటన గురించి ఆలోచించలేదు. బాలీవుడ్ దర్శకుడు రాహుల్ డోల కియా వద్ద సహాయ దర్శకులుగా పని చేస్తున్నాను. కెమెరావెనుక చాలా నేర్చుకోవాలన్న దృక్పథంలోనే ఉన్నాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో నేను నృత్యం నేర్చుకుంటున్నాను. అందుకే మణిరత్నం చిత్రంలో నాయికిగా నూరుశా తం న్యాయం చేయగలనా అన్న సందేహం కారణంగా ఆ అవకాశాన్ని అందుకోలేకపోయాను.
 
 షమితాబ్‌లో అవకాశం ఎలా వచ్చింది?
 ఒకరోజు క్యాజువల్‌గా దర్శకుడు బాల్కిని కలిశాను. ఆ సమయంలో ఆయన షమితాబ్ చిత్రం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఎలా ఉం దని నా వైపు చూశారు. ఆయన స్క్రిప్టు నరేషన్ చేసిన విధానం చూసి నేను బౌల్డ్ అయిపోయాను. అదే విషయాన్ని ఆయనతో చెప్పాను. అందులో నాయికి పాత్ర చేస్తావా? అని అడిగారు. వెంటనే నేను ఎస్ అన్నాను. అయినా రెండు రోజులు గడువు అడిగి మా అమ్మతో సంప్రదించాను. అమ్మ నిర్ణయాన్ని నాకే వదిలేశారు. దీంతో నటించడానికి సిద్ధం అయ్యాను.
 
 షమితాబ్ చిత్రం చూశాక..
 షమితాబ్ చిత్రం చూసిన తరువాత నా నిర్ణయం రైట్ అనిపించింది. అయితే అది నన్ను సముచిత స్థాయికి చేర్చుతుందని ఇప్పుడే చెప్పలేను. ఎలా ఆదరిస్తారన్నది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. అయితే ఒక మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నానన్న సంతృప్తి మాత్రం నాకుంది. అక్క శ్రుతి హాసన్ మాదిరిగానే భారతీయ నటిగా పేరు తెచ్చుకోవాలనుంది. తమిళంలోనూ మంచి కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. చాలా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే మంచి చిత్రం ఎంచుకుని నటిస్తాను.
 

Advertisement
Advertisement