విశ్రాంతి ఎందుకు? | Sakshi
Sakshi News home page

విశ్రాంతి ఎందుకు?

Published Wed, Nov 26 2014 1:41 AM

విశ్రాంతి ఎందుకు?

విశ్రాంతి పొందే వయసు కాదు నాది అంటోంది శ్రుతిహాసన్. ఒక లెజండ్ వారసురాలైన ఈ బ్యూటీ   ప్రస్తుతం నటిగా చాలా కఠినంగా శ్రమిస్తున్నారట. బహుభాషా నటిగా, క్రేజీ హీరోయిన్‌గా శ్రుతి చెన్నై, హైదరాబాద్, ముంబాయి అంటూ పరుగులు తీస్తూ సగం కాలాన్ని ప్రయాణాల కోసం విమానాల్లోనే గడిపేస్తున్నారు. తమిళంలో విజయ్ సరసన ఒక చిత్రం, తెలుగులో మహేష్‌బాబుతో ఒక చిత్రం హిందీలో ఏకంగా ఐదు చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉంది శ్రుతి హాసన్. ఈ బ్యూటీని విశ్రాంతి అనే విషయూన్ని మరిచిపోయి నటిస్తున్నారే అని అడిగితే విశ్రాంతి పొందే వయసు కాదు నాది. శ్రమించే పరువం అని బదులిచ్చారు. ఇంకా చెబుతూ కష్టపడందే ఏదీ సులభంగా పొందలేమని చెప్పారు. పైగా కష్టపడకుండా లభించిన దానిలో కిక్ ఉండదు.
 
 అందువల్లే నిరంతరం శ్రమిస్తున్నాను. అంతేకాకుండా కాస్త రిలాక్స్ అయితే విజయానికి దూరం అవుతాం. విశ్రాంతి తీసుకోవడానికి ముందు ముందు చాలా సమయం ఉంటుంది. నటులు స్టార్ అంతస్తు కోసం చాలా కాలం పోరాడి గెలుపొందుతున్నారు. అదే విధంగా నేను విజయ పథంలో కొనసాగడానికి కఠినంగా శ్రమిస్తున్నాను. మరో విషయం ఏమిటంటే ఒక్కో చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు ఉత్సాహం పొంగి పొర్లుతోంది. షూటింగ్ ముగిసి ప్యాకప్ అనగానే మనసుకు కష్టం అనిపిస్తుంటోంది. కారణం నేను సినిమాను అంతగా ప్రేమించడమేనని అంటున్నారు శ్రుతిహాసన్. ఈ భామ మాటలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండదు. 

Advertisement
Advertisement