మాయ లా(లే)డి అరెస్టు | Sakshi
Sakshi News home page

మాయ లా(లే)డి అరెస్టు

Published Sat, Oct 21 2017 10:47 AM

50 lakhs fraud by women in tamilnadu

సాక్షి, తమిళనాడు: వీఐపీలు ఉండే ఇంట్లో అద్దెకు దిగింది. దర్జాగా కార్లో వచ్చింది. హోంశాఖలో ప్రధాన అధికారిగా చెప్పకు తిరిగింది. అదంతా నిజమని ఇరుగుపొరుగు నమ్మేశాఉ. ఇంక అనుకున్న పనిని మొదలు పెట్టింది. అమాయకులను చేసి రూ.50లక్షలు మోసం చేసింది. చివరకు పోలీసులకు చిక్కింది.  

వివరాల్లోకి వెళ్తే  కేరళ రాష్ట్రం కొట్టాయం కుమరన్‌ నగర్‌కు చెందిన ఆసితా మోహన్‌ (24), రెండు నెలలకు ముందు పాలక్కాడు నగర్‌లో వీఐపీలు ఉండే కాలనీలో ఇంటిలో అద్దెకు దిగింది. ప్రతి రోజూ అనితా మోహన్‌ డీలెక్స్‌ కారులో ఇంటి నుంచి ఉదయం బయలుదేరి రాత్రి ఇంటికి తిరిగి వస్తుంటుంది. తాను కోవై హోంశాఖలో ఉద్యోగులను ఎంపిక చేసే విభాగంలో వున్నట్టు చెప్పుకుంది. ఆమె ప్రవర్తన చూసిన నిజమేనని నమ్మిన ముగ్గురు ఉద్యోగం ఇప్పించమని రూ.3 లక్షలు, రూ.4 లక్షలు, రూ.5 లక్షలు చొప్పున ఆమెకు ఇచ్చారు.

కానీ చాలా రోజులైనప్పటికీ ఆమె ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఆసితా మోహన్‌ గురించి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడు సంవత్సరాలకు ముందు విమానాశ్రయంలో అధికారిణిగా చేస్తున్నట్టు చెప్పి మోహన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. మోహన్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నాడు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసితా మోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం కోవైలో అరెస్టు చేశారు. విచారణలో ఆమె పలువురిని ఉద్యోగం పేరిట రూ.50 లక్షలు మోసం చేసినట్టు తెలిసింది.

Advertisement
Advertisement