పిల్లి మాంసంతో బిర్యానీ

11 Feb, 2018 03:09 IST|Sakshi

చెన్నై ఫుట్‌పాత్‌ దుకాణాల్లో విక్రయం

టీ.నగర్‌(చెన్నై): హోటళ్లలో సాధారణంగా చికెన్, మటన్‌ బిర్యానీ అందుబాటులో ఉంటుంది. కానీ, చెన్నైలో ఫుట్‌పాత్‌ దుకాణాల్లో పిల్లిమాంసంతో బిర్యానీ విక్రయిస్తున్న విషయం బట్టబయలైంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో పెంచుకుంటున్న పిల్లులు తరచూ కనిపించకుండా పోతున్నాయి. తాము పెంచే పిల్లులను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారనే ఫిర్యాదులు పోలీసులకు తలనొప్పిగా మారింది. వాటి ఆచూకీ కనుగొనడం పోలీసులకు చికాకు కలిగించింది. దీంతో పిల్లులు పోగొట్టుకున్న వారు గత నెలలో పోలీసు కమిషనర్‌ విశ్వనాథన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు.

నక్కలవాళ్లు కొందరు పిల్లులను పట్టుకుని వెళుతున్నట్లు, వారిని పట్టుకుని విచారణ జరిపితే వాస్తవాలు తెలుస్తాయని కమిషనర్‌కు విన్నవించారు. దీంతో నక్కలవాళ్లు అధికంగా జీవించే ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విచారణలో పిల్లులను నక్కలవాళ్లు అపహరించిన విషయం వెలుగుచూసింది. చెన్నై, శివారు ప్రాంతాల్లో అనేక ఏళ్లుగా పిల్లులను పట్టుకుని, ఫుట్‌పాత్‌పై బిర్యానీ తయారు చేసే దుకాణయజమానులకు రూ.50కు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా