ఫ్లిప్ కార్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇవేనట! | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇవేనట!

Published Sat, May 13 2017 10:51 AM

ఫ్లిప్ కార్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇవేనట! - Sakshi

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కు తెరపడే రోజే, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ల ఉత్సవం ప్రారంభించబోతుంది. మే 14 నుంచి బిగ్ 10 సేల్ ను నిర్వహించేందుకు ఫ్లిప్ కార్ట్ సిద్ధమైంది. ఈ సేల్ లో భాగంగా మే15న స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ 10 సేల్ కింద, శాంసంగ్ గెలాక్సీ ఆన్5, గెలాక్సీ ఆన్7 స్మార్ట్ ఫోన్లను 6,490 రూపాయలకు, 7,990 రూపాయలకు అందుబాటులో ఉంచుతుంది. అంటే గెలాక్సీ ఆన్5పై 2500 రూపాయలు,  గెలాక్సీ ఆన్7 పై 1000 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగిన గెలాక్సీ ఆన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ పై 3,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తూ 14,900 రూపాయలకే అందుబాటులోకి తెస్తోంది. 
 
లెనోవో కంపెనీ సైతం తన ఫోన్లపై డిస్కౌంట్ల ఆఫర్ల వెల్లువ కురిపిస్తోంది. లెనోవో జెడ్2 ప్లస్  స్మార్ట్ ఫోన్ పై 6,000 రూపాయల మేర డిస్కౌంట్ అందిస్తూ 11,999రూపాయలకే విక్రయించేందుకు సిద్ధంగా ఉంచనుందట. కే5 నోట్ ఫోన్ 4జీబీ ర్యామ్/64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ లోని అన్ని వేరియంట్లపై 2,000 రూపాయల డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తూ.. బిగ్ 10 సేల్ లో 11,499 రూపాయలకు ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పైకి వస్తున్నాయి. మోటో జీ టర్బో స్మార్ట్ ఫోన్ ధర కూడా 5,500 రూపాయల మేర తగ్గనుంది.   
 
పానసోనిక్ తన ఎలుగ రే ఎక్స్, ఎలుగ రే మ్యాక్స్(4జీబీ ర్యామ్/64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్) స్మార్ట్ ఫోన్లపై 500 రూపాయలు, 1000 రూపాయల డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. దీంతో ఎలుగ రే ఎక్స్ 8,499 రూపాయలకు, ఎలుగ రే మ్యాక్స్ 11,499 రూపాయలకు విక్రయానికి వస్తున్నాయి. ఆశ్చర్యకరంగా తన పీ85, ఎలుగ రే స్మార్ట్ ఫోన్లను ఈ సేల్ ద్వారానే పానసోనిక్ కంపెనీ లాంచ్ చేస్తోంది. 4000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన పానసోనిక్ పీ85 స్మార్ట్ ఫోన్ ధర 6,499 రూపాయలు. తక్కువగా 4,999 రూపాయలకే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అదనంగా ఎక్స్చేంజ్ పై 1500 డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది.
 
ఎలుగ రే స్మార్ట్ ఫోన్ ధర 7,999 రూపాయలు కాగ, తక్కువకు 6,999రూపాయలకు విక్రయానికి వస్తోంది. దీనిపై కూడా అదనంగా ఎక్స్చేంజ్ పై 1500 రూపాయల డిస్కౌంట్ ను ఇస్తోంది. మరో స్మార్ట్ ఫోన్ కంపెనీ హువాయ్ తన పీ9 స్మార్ట్ ఫోన్ పై 10 వేల రూపాయల మేర డిస్కౌంట్ ను కల్పిస్తోంది. హానర్ 8 స్మార్ట్ ఫోన్ పై కూడా ఎక్స్చేంజ్ పై 5000 రూపాయల డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఆసుస్ జెన్ ఫోన్3 పై 7,000 రూపాయల డిస్కౌంట్, జెన్ ఫోన్ 3 లేజర్ పై 8,000 రూపాయల డిస్కౌంట్ అందుబాటులో ఉంటాయి.   
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement