రూ.9వేల రివార్డు ఆఫర్‌తో గూగుల్‌ తేజ్‌.. | Sakshi
Sakshi News home page

రూ.9వేల రివార్డు ఆఫర్‌తో గూగుల్‌ తేజ్‌..

Published Mon, Sep 18 2017 10:53 AM

రూ.9వేల రివార్డు ఆఫర్‌తో గూగుల్‌ తేజ్‌.. - Sakshi

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ తన మొబైల్‌ పేమెంట్‌ సర్వీసును భారత్‌లో లాంచ్‌ చేసింది. తేజ్‌ అనే పేరు మీద ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఐ ఐడీ, క్యూఆర్‌ కోడ్‌, ఫోన్‌ నెంబర్‌, బ్యాంకు అకౌంట్ల ద్వారా యూజర్లు తమ నగదును ట్రాన్సఫర్‌ చేసుకునే వెసులుబాటును ఈ పేమెంట్‌ సర్వీసు కల్పిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండు డివైజ్‌లకు గూగుల్‌ తేజ్‌ అందుబాటులో ఉంటుంది. ఈ అప్లికేషన్‌ గురించి మరింత సమాచారం అందించడానికి గూగుల్‌ నేడు ఢిల్లీలో ఓ ఈవెంట్‌ నిర్వహించబోతుంది. ఈ ఈవెంట్‌లో అధికారికంగా అరుణ్‌జైట్లీ ఈ యాప్‌ను ఆవిష్కరించనున్నారు.
 
ఈ యాప్‌ను ప్రమోట్‌ చేసేందుకు రిఫరెల్‌ రివార్డులను కూడా గూగుల్‌ ప్రకటించింది. ఈ యాప్‌ను యూజర్‌ తమ స్నేహితునికి రిఫర్‌ చేసి, దానిలో సైన్‌ ఇన్‌ అయి, పేమెంట్‌చేస్తే, మీరు, మీ ఫ్రెండ్‌ రూ.51 రివార్డు పొందనున్నారు. ఇలా ఎక్కువ మందికి రిఫర్‌ చేస్తే, గరిష్టంగా రూ.9000 వరకు రివార్డును సొంతం చేసుకోవచ్చు. 2018 ఏప్రిల్‌ 1 వరకు ఈ రిఫరెల్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. 
 
అన్ని దేశీయ దిగ్గజ బ్యాంకులతో పాటు, డామినోస్‌, రెడ్‌బస్‌, పీవీఆర్‌లను తమ పేమెంట్‌ పార్టనర్లుగా గూగుల్‌ చేర్చుకుంది. అదనంగా బిజినెస్‌ యూజర్ల కోసం కూడా ఈ యాప్‌ను ప్రారంభించింది. వ్యాపార యజమానులు, దుకాణదారులు తమ కరెంట్‌ అకౌంట్‌తో తేజ్‌ యాప్‌ను వాడుతూ ఎలాంటి ఫీజులు లేకుండా నేటి నుంచి డిజిటల్‌ పేమెంట్లను అంగీకరించడం ప్రారంభించవచ్చని గూగుల్‌ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. 
 
తేజ్‌ యాప్‌ యాక్టివేట్‌ ఎలా....
  • గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి గూగుల్‌ తేజ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • ఇది ప్రారంభించడానికి భాషను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. హిందీ, బెంగాళి, గుజరాతీ, కన్నడ, వంటి భాషలకు ఈ యాప్‌ సహకరిస్తోంది.
  • బ్యాంకు అకౌంట్‌తో లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌ను నమోదుచేసుకోవాలి
  • అలర్ట్‌లు, నోటిఫికేషన్‌, వెరిఫికేషన్‌లు పొందడానికి గూగుల్‌ అకౌంట్‌ను ఎంపికచేసుకోవాలి
  • ఇన్‌-యాప్‌ లాక్‌ను గూగుల్‌ తేజ్‌ సపోర్టు చేస్తుంది. కొత్త లాక్‌ను కూడా గూగుల్‌ తేజ్‌ కోసం క్రియేట్‌ చేసుకోవచ్చు
  • యూపీఐ ద్వారా, ఎంపికచేసిన బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌తో పేమెంట్‌ చేసుకోవాలంటే హోమ్‌ స్క్రీన్‌ వెళ్లాల్సి ఉంటుంది
  • యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ వంటి వాటితో గూగుల్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకునూ ఇది సపోర్టు చేస్తుంది. 
  • మీ అకౌంట్‌ నెంబర్‌ను లింక్‌చేసుకోవచ్చు. దీని కోసం అకౌంట్‌ నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వంటి బేసిక్‌ బ్యాంకు వివరాలు అందజేయాలి. 
  • నగదు ఆధారిత లావాదేవీలకు అప్లికేషన్‌లోనే ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటుచేశారు. నగదు ఆధారిత లావాదేవీల చరిత్రను యూజర్లు చూసుకోవచ్చు. అన్ని రకాల లావాదేవీలను దీనిలో చెక్‌ చేసుకోవచ్చు.
 

Advertisement
Advertisement