విపణిలోకి ఐటెల్ 4జీ స్మార్ట్ ఫోన్లు | Sakshi
Sakshi News home page

విపణిలోకి ఐటెల్ 4జీ స్మార్ట్ ఫోన్లు

Published Sat, May 6 2017 8:18 AM

విపణిలోకి ఐటెల్ 4జీ స్మార్ట్ ఫోన్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటెల్ మొబైల్ విపణిలోకి కొత్త శ్రేణి 4జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. రూ.5,840కి విష్ ఏ41, రూ.5,390కి విష్ ఏ21 పేరిట ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ పోర్ట్ ఫోలియోను, కేటరింగ్ ను మరింత బలోపేతం చేయడానికి కంపెనీ ఈ ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.3 జీహెచ్జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 32జీబీ వరకు విస్తరణ మెమరీతో ఈ ఏ41 ఫోన్ ను కంపెనీ రూపొందించింది.
 
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపీ ఆటోఫోకస్ రియర్, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ కు ఉన్నాయి.  విష్ ఏ21 ఫోన్ కి కూడా ఇదేమాదిరి ఫీచర్లు కలిగి ఉన్నాయి. చైనాకు చెందిన ఈ ట్రాన్సిషన్ హోల్డింగ్స్ మన దేశంతో పాటు చైనా, ఆఫ్రికా వంటి 46 దేశాల్లో ఐటెల్ బ్రాండ్ తో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తోంది. ఇప్పటివరకు 120 మిలియన్ ఫోన్లను ఈ కంపెనీ విక్రయించింది.  

Advertisement
Advertisement