ఆగస్టు 10న ఎల్జీ కొత్త ఫోన్‌, ధరెంతంటే... | Sakshi
Sakshi News home page

ఆగస్టు 10న ఎల్జీ కొత్త ఫోన్‌, ధరెంతంటే...

Published Sat, Aug 5 2017 3:50 PM

ఆగస్టు 10న ఎల్జీ కొత్త ఫోన్‌, ధరెంతంటే...

ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఎల్‌జీ క్యూ6 మరో ఐదు రోజుల్లో భారత మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. ఆగస్టు 10న ఎల్‌జీ క్యూ6 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయాలని ఆ కంపెనీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఓ ఫోటోని పోస్టు చేస్తూ తెలియజేసింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లోనే ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.  తొలుత ఈ ఫోన్‌ని కంపెనీ ఈ ఏడాది జూలైలో పోలాండ్‌లో లాంచ్‌ చేసింది. ఆస్ట్రో బ్లాక్‌, ఐస్‌ ప్లాటినమ్‌ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. కంపెనీ టీజ్‌ చేసిన పోస్టర్‌ ప్రకారం భారత్‌లో దీని ధర సుమారు రూ.19,900గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ తర్వాత ఎల్‌జీ వీ30 స్మార్ట్‌ఫోన్‌ను కూడా బెర్లిన్‌లో ఆగస్టు 31న లాంచ్‌ చేయబోతుంది. ఆరు అంగుళాలతో ఆ ఫోన్‌ వస్తోంది. అన్ని ఎల్‌జీ ఫోన్లలో కెల్లా దీనికే అతిపెద్ద స్క్రీన్‌ ఉండబోతుంది. 
 
ఎల్‌జీ క్యూ6 ఫీచర్లు...
5.5 అంగుళాల స్క్రీన్‌
2160x1080 పిక్సెల్‌ రెజుల్యూషన్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 435 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
13 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
Advertisement