నోకియా ఫోన్లు వచ్చేశాయ్‌..ధరలు? | Sakshi
Sakshi News home page

నోకియా ఫోన్లు వచ్చేశాయ్‌..ధరలు?

Published Tue, Jun 13 2017 1:39 PM

నోకియా ఫోన్లు వచ్చేశాయ్‌..ధరలు?

న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నోకియా బ్రాండ్‌ ఫోన్‌ ప్రేమికులకు శుభవార్త.  ఆండ్రాయిడ్‌  కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో సరికొత్త నోకియా స్మార్ట్‌ఫోన్లు మంగళవారం  భారత మార్కెట్లో లాంచ్‌ అయ్యాయి. ప్రస్తుత నోకియా బ్రాండ్‌ ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా 6, నోకియా 5, నోకియా 3 పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది.  నోకియా 6, నోకియా 5,  నోకియా 3  ధరలు వరుసగా రూ .14,999, రూ .12,899 మరియు రూ .9,499. నోకియా 5 ప్రత్యేకంగా ఆఫ్ లైన్ రిటైలర్లలోఅందుబాటులో ఉంటుంది, అయితే నోకియా 6 అమెజాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. నోకియా 3 ఇతర రిటైల్ దుకాణాల్లో కూడా కొనుగోలు చేయవచ్చు.  నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌ జూన్‌ 16 నుంచి, నోకియా 5ను జులై 7 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. అలాగే జూలై 14నుంచి నోకియా 6 అమెజాన్‌లో  ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.


నోకియా 6
5.5 ఇంచ్‌ల హెచ్‌డీ స్క్రీన్‌, అల్యూమినియం కేసుతో నాలుగు రంగులలో లభ్యంకానుంది. ఆండ్రాయిడ్‌​ 7.1 నౌగట్‌,  క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రాసెసర్‌, అడ్రెనో 505 గ్రాఫిక్స్‌ ప్రాసెసర్‌లతో రూపొందింది. 32జీబీ/3జీబీ- 64జీబీ/4జీబీ వెర్షన్‌లో  లభ్యం.  ఎస్‌డీ కార్డ్‌ ద్వారా 256 జీబీ వరకూ మెమరీ పెంచుకోవచ్చు. వెనుక 16 ఎంపీ, సెల్ఫీలకు ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాలను అమర్చింది.  3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం.
నోకియా 5
5.2 డిస్‌ ప్లే,
 720x1280 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌​ 7.1 నౌగట్‌
 2.5డీ  కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌
2 జీబీ ర్యామ్‌
16జీబీ  స్టోరేజ్‌
13 ఎంపీరియర్‌  కెమెరా,
8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ  కాపర్‌, బ్లాక్‌ అండ్‌ సిల్వర్‌  కలర్స్‌ లో లభ్యం.

ఇక నోకియా 3 విషయానికి వస్తే
5 అంగుళాల డిస్‌ప్లే,
8 ఎంపీ ఫ్రంట్‌, రియర్‌ కెమెరా,
2 జీబీ ర్యామ్‌,
16 జీబీ స్టోరేజ్‌
2630 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

 

Advertisement
Advertisement