నోకియా 6 విక్రయం నేటి నుంచే... | Sakshi
Sakshi News home page

నోకియా 6 విక్రయం నేటి నుంచే...

Published Wed, Aug 23 2017 10:54 AM

నోకియా 6 విక్రయం నేటి నుంచే...

హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన మిడ్‌-రేంజ్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 6 తొలి విక్రయం నేటి(బుధవారం) నుంచే ప్రారంభమవుతోంది. అమెజాన్‌ ఇండియాలో నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. జూన్‌లో నోకియా 3, నోకియా 5తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేసింది. మిగతా రెండు స్మార్ట్‌ఫోన్లు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో విక్రయానికి వచ్చాయి. నోకియా 6 మాత్రం నేడే విక్రయానికే వస్తోంది. ఈ ఫోన్‌ లాంచ్‌ ఆఫర్లను కూడా అమెజాన్‌ లిస్టు చేసింది. సోమవారంతోనే ఈ ఫోన్‌ తొలి సేల్‌ రిజిస్ట్రేషన్‌లు క్లోజయ్యాయి. మేట్‌ బ్లాక్‌, సిల్వర్‌, టాంపర్డ్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి ఉండనుంది.
 
నోకియా 6 లాంచ్‌ ఆఫర్స్‌...
నోకియా 6 ధర 14,999 రూపాయలు. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు రూ.1000 అమెజాన్‌ పే బ్యాలెన్స్‌. కిండ్లీ బుక్స్‌పై 80 శాతం తగ్గింపు. మేక్‌మైట్రిప్‌లో రూ.2500 డిస్కౌంట్‌. ఐదు నెలల వ్యవధిలో 45జీబీ ఉచిత డేటా.
 
నోకియా 6 ఫీచర్లు...
5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
డ్యూయల్‌ సిమ్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌
32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
16 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

తప్పక చదవండి

Advertisement