ఒప్పో ఎఫ్‌ 3 ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ | Sakshi
Sakshi News home page

ఒప్పో ఎఫ్‌ 3 ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

Published Sat, Aug 5 2017 3:20 PM

ఒప్పో ఎఫ్‌ 3 ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

చైనా మొబైల్‌ దిగ్గజం ఒప్పో తన తాజా స్మార్ట్‌ఫోన్‌ 'ఒప్పో ఎఫ్‌3' లో కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాలతో స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌ను రోజ్ గోల్డ్ రంగులో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్‌ ధరను రూ.19,900గా కంపెనీ నిర్ణయించింది. ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఇది అందుబాటులో ఉండనుంది.
 
ఈ ఫోన్‌ లాంచింగ్‌ సందర్భంగా ఒప్పో ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ విల్‌యాంగ్‌ మాట్లాడుతూ... భారతీయ వినియోగదారుడి ఫ్యాషన్, అధునాతన టెక్నాలజీ అద్భుతమైన సంగమం అందించే లక్ష్యంతో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. వినూత్న కెమెరా టెక్నాలజీ దీనిలో అందించినట్టు తెలిపారు. ఒప్పో ఎఫ్‌3కి అనూహ్య స్పందన వస్తుందని, ముఖ్యంగా యువత దీన్ని ఎక్కువగా ఆదరిస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకే ఫ్యాషనబుల్‌, ట్రెండీయర్‌ వేరియంట్‌తో భారత యువతను మరింత సర్‌ప్రైజ్‌ చేస్తున్నామని చెప్పారు. 
 
ఒప్పో ఎఫ్‌3 స్పెషల్‌ వేరియంట్‌ ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌ డీ డిస్‌ప్లే
1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌
16 ఎంపీ సెల్పీ కెమెరా
13ఎంపీ రియర్‌  కెమెరా
4జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, ( ఎస్‌డీ కార్డు ద్వారా  విస్తరించుకునే అవకాశం)
3200ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement
Advertisement