వివో వీ5 ప్లస్‌ ఐపీఎల్‌ స్పెషల్‌...స్పెషల్‌ కలర్‌లో | Sakshi
Sakshi News home page

వివో వీ5 ప్లస్‌ ఐపీఎల్‌ స్పెషల్‌ ...స్పెషల్‌ కలర్‌లో

Published Wed, Apr 5 2017 1:37 PM

వివో వీ5 ప్లస్‌  ఐపీఎల్‌ స్పెషల్‌...స్పెషల్‌ కలర్‌లో

 ఐపిఎల్‌ ఫీవర్‌ ను క్యాష్  చేసుకున్న వివో  క్రికెట్‌ లవర్స్‌కోసం  ఓ సరికొత్త  స్మార్ట్‌ ఫోన్‌  లాంచ్‌ చేసింది.  ముఖ్యంగా  ఐపీఎల్‌ 10 సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని, వీ 5ప్లస్‌ పేరుతో సెల్ఫీ ప్రియుల కోసం దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.  హైదరాబాద్‌లో  జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి సోహా ఆలీ ఖాన్‌   ఈ స్పెషల్‌ ఎడిషన్‌ ను  విడుదల చేశారు.  మాట్‌  బ్లాక్‌ లో  ప్రత్యేకంగా లాంచ్‌ అయిన ఈ డివైస్‌లో మిగతా ఫీచర్లన్నీ  దాదాపు పాత  వివో5 ప్లస్‌ను పోలి వున్నా.. ఈ ఫోన  వెనుక భాగంలో ప్రత్యేకంగా  ఐపీఎల్‌ లోగోను ముద్రించడమే దీని ప్రత్యేకత . ఈ స్మార్ట్‌ఫోన్‌  ధరను కంపెనీ రూ.27,980గా నిర్ణయించింది. ఏప్రిల్‌ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. ఇప్పటివరకూ ఇది గోల్డ్‌ కలర్‌లో మాత్రమే లభ్యమవుతోంది.

క్రికెట్‌ ప్రేమికులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ ఫోనును తీర్చిదిద్దినట్లు వివో చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వివేక్‌ ఝాంగ్‌ పేర్కొన్నారు.  ఐపీఎల్‌ 10వ వార్షికోత్సవంగా  ఈ స్పెషల్‌ ఎడిషన్‌ తీసుకొచ్చినట్టు చెప్పారు.   తమ వినియోగదారులకు కేవలం ఫోన్‌ అందించడమే కాకుండా... ఈ అనుభవాన్ని జీవితాంతం  గుర్తంచుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.

వివో వీ 5 ప్లస్‌  ఫీచర్స్‌
5.5అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 రిజల్యూషన్‌
 గొరిల్లా గ్లాస్‌తో , ఆండ్రాయిడ్‌ 6.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌16మెగా పిక్సెల్ రియర్‌ కెమెరా
20 ఎంపీ ఫ్రంట్‌  కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ  స్టోరేజ్‌,
3160 ఎంఏహెచ్‌  బ్యాటరీ సామర్థ్యం
 

Advertisement
Advertisement