షియోమి ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ | Sakshi
Sakshi News home page

షియోమి ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్

Published Fri, Apr 28 2017 2:34 PM

షియోమి ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్

గత కొన్ని రోజులుగా ఊరించిన ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ ను షియోమి ఈ నెల 19న చైనాలో లాంచ్ చేసేసింది. కానీ షియోమి స్మార్ట్ ఫోన్ లవర్స్ అంచనావేసిన విధంగా దాంతో పాటు లాంచ్ అవుతుందనుకున్న ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి తీసుకురాకుండా వారిని నిరాశపరిచింది. మరికొన్ని నెలల్లో ఎలాగో ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను షియోమి లాంచ్ చేస్తుందని ఊహాగానాలు టెక్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ షాకింగ్ న్యూస్ వెలువడింది.  షియోమి  ఎంఐ 6 ప్లస్ లాంచింగ్ ను పూర్తిగా రద్దు చేసిందని చైనాకు చెందిన ఓ రిపోర్టు రివీల్ చేసింది. ఎంఐ 6 సిరీస్ లో ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ అది ఇటీవలే లాంచ్ అయిన కొత్త ఫోనేనని రిపోర్టు తెలిపింది.
 
ఇక ఈ సిరీస్ లో ఎలాంటి ఫోన్ ను ఇప్పట్లో షియోమి తీసుకురాదని జిజ్మోచైనా రిపోర్టు చేసింది. ఈ రిపోర్టు ఎంఐ 6 ప్లస్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్న షియోమి ఫ్యాన్స్ కు నిరాశకలిగించింది. ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ బదులు, ఎంఐ నోట్ 3 స్మార్ట్ ఫోన్ ను షియోమి లాంచ్ చేస్తుందని ఈ రిపోర్టు వెల్లడించింది. ఎంఐ నోట్ 2 సక్సెస్ తో ఎంఐ నోట్ 3 ను విడుదల చేయడానికి షియోమి వర్క్ చేస్తుందని, ఈ ఫోన్ ను సెప్టెంబర్ లో లాంచ్ చేయనుందని పేర్కొంది. అదేవిధంగా ఇటీవలే అదిరిపోయే ఫీచర్లతో చైనాలో లాంచ్ అయిన ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ కూడా భారత్ కు రాదని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే  ఎంఐ నోట్ 3 లాంచింగ్ కు సంబంధించి, ఎంఐ 6 ప్లస్ రద్దుకు సంబంధించి ఇప్పటివరకు షియోమి ఎలాంటి కన్ ఫర్మేషన్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
Advertisement