రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న షియోమి రెడ్మి 4 | Sakshi
Sakshi News home page

రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న షియోమి రెడ్మి 4

Published Wed, Jun 28 2017 8:38 AM

Xiaomi Redmi 4 Sells 1 Million Units in India in 30 Days, Company Claims



అతితక్కువ సయమంలో వినియోగదారులను మన్ననలను పొందిన ఫోన్లలో షియోమి రెడ్ మి ముందజలో ఉంటుంది. రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4ఏ గ్రాండ్ సక్సెస్ అనంతరం మరో అదరగొట్టే స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ను షియోమి గతనెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. లాంచ్ అయిన 30 రోజుల్లో ఈ ఫోన్ 10 లక్షల యూనిట్లు అమ్ముడు పోయాయి. రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ఫ్లాష్ సేల్, ప్రీ-ఆర్డర్స్ ద్వారా విక్రయిస్తోంది. తమకు ఇది అతిపెద్ద మైలురాయి అని కంపెనీ పేర్కొంది. భారత్ లో తమ జర్నీ ప్రారంభించినప్పటి నుంచి రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ తమ రికార్డులన్నింటిన్నీ బ్రేక్ చేస్తుందని కంపెనీ ఎంతో ఆనందంతో వ్యక్తంచేసింది.
 
మూడు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర 6,999 రూపాయలు, 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ధర 8,999 రూపాయలు, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలుగా ఉంది. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ లలో కంపెనీ ప్రతివారం ఫ్లాష్‌ సేల్స్, ప్రీ-ఆర్డర్లను చేపడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసినప్పుడే షియోమి ఈ ఫోన్ కచ్చితంగా రెడ్ మి3 ఎస్ వేరియంట్ల విక్రయాలను నమోదుచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. గతేడాదిలో లాంచ్ అయిన రెడ్ మి 3ఎస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ''హ్యయస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఆన్ లైన్'' గా నిలిచింది. ఈ ఫోన్ 40 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది.   
 
రెడ్ మి 4 కీలక స్పెషిఫికేషన్స్...
5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్
4100ఎంఏహెచ్ బ్యాటరీ
1.4గిగాహెడ్జ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ చిప్
2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ 
మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
13ఎంపీ రియర్ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్
4జీ ఎల్టీఈ
బ్లాక్, మెటల్ రంగుల్లో అందుబాటు
వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్
హైబ్రిట్ సిమ్ ట్రే

Advertisement

తప్పక చదవండి

Advertisement