ఆర్టీసీ బస్సు, టవేరా ఢీ | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, టవేరా ఢీ

Published Thu, May 14 2015 5:00 PM

10 injured in road accident

ఇల్లందు : ఆర్టీసీ బస్సు, టవేరా వాహనం పరస్పరం ఢీకొన్న ప్రమాదం ఖమ్మం జిల్లా ఇల్లెందు శివారులో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టవేరా వాహనం పల్టీ కొట్టింది. దీంతో టవేరాలోని పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో రఘ, వీరన్న అనే ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Advertisement
Advertisement