ఈ బడ్జెట్‌లోనే గుట్టకు రూ.100 కోట్లు | Sakshi
Sakshi News home page

ఈ బడ్జెట్‌లోనే గుట్టకు రూ.100 కోట్లు

Published Wed, Feb 25 2015 7:20 AM

ఈ బడ్జెట్‌లోనే గుట్టకు రూ.100 కోట్లు - Sakshi

- యాదగిరి క్షేత్రంపై సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి


సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధికి ఈ బడ్జెట్‌లోనే రూ. 100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అలాగే దేవాలయానికి వారసత్వ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. తిరుమల తరహాలో యాదగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన కేసీఆర్ మంగళవారం దీనిపై అధికారులతో సమీక్షించారు. యాదగిరి క్షేత్రంలో కొత్త నిర్మాణాలు ఆగమశాస్త్రబద్ధంగానే ఉండాలని, కొత్తగా నిర్మాణాలు చేపట్టే ముందు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంతోపాటు గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణాల బాధ్యతను పర్యవేక్షిస్తున్న వాస్తుశిల్పులు రాజ్, ఆనంద్‌సాయి, జగన్, దేవాదాయశాఖ స్థపతి సౌందరరాజన్‌లు తాము రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రికి చూపించారు.
 
ఈ నమూనాల ప్రకారం ఆలయం నిర్మిస్తే అది కొత్త నిర్మాణంలా కాకుండా వందేళ్ల క్రితం నాటి నిర్మాణ లను పోలినట్లుగా, గుహ గుండా వెళ్తున్న అనుభూతి భక్తులకు కలిగేలా అద్భుత శిల్పరీతులతో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్నిమార్పుచేర్పులను సూచిస్తూ పైవిధంగా స్పందించారు. క్షేత్రం వద్ద కీంద్రీకృత పార్కింగ్ వ్యవస్థ, తిరుమల తరహాలో రెండు రోడ్డు మార్గాలు, భారీ షాపింగ్ కాంప్లెక్స్, వి శ్రాంతి స్థలంతోపాటు కాటేజీలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.   సామూహిక వ్రతమండపం, యాగశాల, కల్యాణ మండపాలు ఏర్పా టు చేయాలని తెలి పారు.

విశ్రాంత ఐఏఎస్ అధికారి కిషన్‌రావు ప్రత్యేకాధికారిగా ఏర్పాటైన యాదగిరిగుట్ట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ దేవాలయ అభివృద్ధి, భూసేకరణ తదితర వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. కొండపైన ఉన్న 10 ఎకరాల స్థలంలో 5 ఎకరాల్లో ఆలయ ప్రాం గణం, మిగతాదాంట్లో ఇతర నిర్మాణాలుం డాలని పేర్కొన్నారు. కొత్త నిర్మాణాల నమూనాల పరిశీలన, తదుపరి సమీక్ష కో సం తాను బుధవారం యాదగిరి క్షేత్రానికి వెళ్తున్నట్టు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాను ఈనెల 27న పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు చెప్పారు.
 
 

Advertisement
Advertisement