పాము కాటు భారత్‌లోనే ఎక్కువ

13 Jul, 2020 02:40 IST|Sakshi

l20ఏళ్లలో 12లక్షలమంది బలి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా పాముకాటుతో సంభవిస్తున్న మరణా ల్లో 50% భారత్‌లోనే నమోదవుతున్నా యి. గత ఇరవై ఏళ్లలో దేశంలో 12 లక్షల మంది అంటే ఏడాదికి 6 వేల వంతున.. మృత్యువాత పడినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ప్రధానంగా జూన్‌–సెప్టెంబర్‌ మధ్య ఈ పరిస్థితి ఎక్కువుందని తేలిం ది. గతంలోని ‘మిలియన్‌ డెత్‌ స్టడీ’ నివేదిక గణాంకాల ఆధారంగా దేశ, విదేశీ నిపుణులు నిర్వహించిన అధ్యయనాన్ని‘ఓపెన్‌–యాక్సెస్‌ జర్నల్‌ ఈ–లైఫ్‌’తాజా సంచికలో ప్రచురిం చారు. ఈ పరిశీలన ప్రకారం 2001–14 మధ్య 70% పాముకాటు మరణాలు బి హార్, మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీ, ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్‌లోనే చోటుచేసుకున్నాయి. భారత్‌లో ఎక్కువగా రస్సెల్స్‌ వైపర్స్, 8 రకాల క్రే ట్స్, 4 రకాల నాగుపాముల కాటు కారణంగా మరణాలు సంభవిస్తున్న ట్టు వెల్లడైంది. వేగంగా చికిత్స అందించ కే మరణాలకు ఆస్కారం ఏర్పడుతోం దని పరిశీలకులు తేల్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు