ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది కిడ్నాప్ | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది కిడ్నాప్

Published Wed, Jan 14 2015 2:38 AM

50 people kidnapped in Chhattisgarh

అందరూ సర్పంచ్ అభ్యర్థులే..
 
చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఒకేసారి 50 మందిని అపహరించారు. సుక్మా జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనలో కిడ్నాప్‌కు గురైన వారంతా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే కావడం గమనార్హం. దండకారణ్య పరిధిలోని జిల్లాల్లో ఈ నెల 28, ఫిబ్రవరి 1, 4 తేదీలలో మూడు విడత ల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో వీరం తా సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. సమావేశం ఉందంటూ ఈ అభ్యర్థులందరినీ ఈనెల 9న మావోయిస్టులు అడవి లోని ఓ రహస్య ప్రాంతానికి పిలిపించినట్లు సమాచారం. నాలుగు రోజులైనా తిరిగి రాకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆం దోళన నెలకొంది. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు లు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎన్నికల్లో పోటీకి దిగిన వారిని అపహరించడంతో మిగిలిన అభ్యర్థుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.
 
మావోయిస్టు డంపు స్వాధీనం


నల్లగొండ: నల్లగొండ జిల్లా చందంపేట మం డలం కంబాలపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస్పీ ప్రభాకర్‌రావు జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డంప్ వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా కంబాలపల్లి గ్రామశివారు బీడాగుండ్ల గుట్టప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన డంపు లభించినట్లు పేర్కొన్నారు. అందులో 5 గ్రేనైడ్లు, 25 జిలెటిన్ స్టిక్స్ ప్యాకెట్లు, 2 ప్లాస్టిక్ డ్రమ్‌లు, 35 టోపీలు, 2 వాటర్ బాటిల్స్, 29 రైఫిల్ స్లింగ్‌లు, 11 బెల్ట్‌లు (తెల్లరంగు), 32 బెల్ట్ (ఆలివ్‌గ్రీన్ కలర్ కలవి), 6 జతల స్టార్స్, 27 విప్లవ సాహిత్య పుస్తకాలు ఉన్నాయన్నారు.
 
 

Advertisement
Advertisement