Sakshi News home page

61 మందికి కరోనా పాజిటివ్‌

Published Tue, Apr 14 2020 1:39 AM

61 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమ వారం ఒక్కరోజే కొత్తగా 61 కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 592 కి చేరింది. ఒకరు మృతిచెందడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 17కి చేరుకుంది. 103 మం ది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యా రు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు సోమవారం రాత్రి బులిటెన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లా ల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు ఉండగా.. ఆ తరువాత స్థానంలో నిజామాబాద్‌ జిల్లా ఉంది. వికారాబాద్, వరంగల్‌ అర్బన్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, మేడ్చల్, నిర్మల్, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

వరంగల్‌ రూరల్, యాదాద్రి భువనగరి, నారాయణ్‌పేట్, వనపర్తి, మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు. రాష్ట్రంలో ఈ నెల 10, 11 తేదీల్లో 16 చొప్పున కేసులు రాగా, 12న 28 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఏకంగా 61 కేసులు నమోదు కావడంతో వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మర్కజ్‌కు సంబంధించినవే.  

కంటైన్మెంట్‌ ఏరియాల్లో సర్వే... 
వైరస్‌ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 246 కంటైన్మెంట్‌ ప్రాంతాలు ఉండగా.. వైద్యాధికారులు వీటిలోని 6.41 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే చేశారు. మొత్తంగా 27,32,644 మందిని కలిసి వారి వివరాలు సేకరించారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నా యా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌ని ట్రేస్‌ చే సి పరీక్షలు చేస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నా రు. పాజిటివ్‌ వచ్చిన వారికి నోటిఫైడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వీటిపై చర్చించేందుకు జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లలో తక్షణ చర్యలు చేపట్టేందుకు సీనియర్‌ వైద్యాధికారులను నియమించారు. వారందరికీ డీఎంహెచ్‌వో స్థాయి అధికారాలు కల్పించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement