కంటి చూపునిద్దాం.. | Sakshi
Sakshi News home page

కంటి చూపునిద్దాం..

Published Wed, Jul 12 2017 2:22 AM

a special activity for Prevention of Blindness

అంధత్వ నివారణకు కుటుంబ సంక్షేమ శాఖ కొత్త కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో అతి పెద్ద సవాలు గా మారుతున్న కంటి చూపు సమస్యల నివారణపై రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. అన్ని వయసులవారి వివరాలు సేకరిం చి అవసరమైన వారికి వెంటనే చికిత్స అందించేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. మూడేళ్లలో రాష్ట్రం లోని అన్ని గ్రామాల్లో వివరాలు సేకరించేలా స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనుంది. మొత్తానికి కంటి చూపు సమస్యల్లేని రాష్ట్రంగా మార్చడానికి సంకల్పించింది. ‘అంధత్వ రహిత తెలంగాణ (ఏబీఎఫ్‌టీ)’ పేరుతో దీన్ని అమలు చేయనుంది.

కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌ కరుణ ప్రత్యేక చొరవతో ప్రముఖ నేత్ర వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇందులో భాగస్వాములు కానున్నారు. ఏబీఎఫ్‌టీ అమలుకు 10 మందితో కార్యాచ రణ కమిటీ ఏర్పాటైంది.  కాగా, దేశంలో  ఏటా సుమారు 20వేలమంది కార్నియాతో అంధత్వానికి గురవుతున్నట్లు సక్షం స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ క్రమం లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్నియాతో పాటు రెటినా, గ్లుకోమా, డయాబెటిస్, ఇతర సమస్యలతోనూ అంధత్వా నికి గురయ్యే పరిస్థితిని నివారించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాలో మూడేళ్లలో ప్రతి వ్యక్తి కంటి సమస్యలను తెలుసుకుని వైద్యం చేయించేలా కార్యచరణ రూపొందిస్తోంది. మొదటి దశలో 10 జిల్లాలను ఎంపిక చేసింది. సమస్యలున్నవారికి ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
Advertisement